వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ 1 బీ వీసాపై ట్రంప్ వైఖరి మారిందా?

విదేశీ నిపుణులు, ప్రత్యేకించి ఇండియన్ ఐటీ నిపుణులకు అందుబాటులో ఉన్న హెచ్ 1 బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించబోరట.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/ న్యూఢిల్లీ : విదేశీ నిపుణులు, ప్రత్యేకించి ఇండియన్ ఐటీ నిపుణులకు అందుబాటులో ఉన్న హెచ్ 1 బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించబోరట. భారత ఐటీ నిపుణుల రాకతో అమెరికన్లకు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు జరుగుతుందో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వివరించి చెప్పామని రిపబ్లికన్ పార్టీ సెనెటర్ - సెనెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఓరియన్ హేచ్ తెలిపారు.

హెచ్ 1 బీ వీసా పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించడంతో ఆయన్ను సమ్మతింపజేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ట్రంప్ ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారని భావిస్తున్నారు. 'ఉద్యోగాలు కల్పించి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ ఆలోచనలను పక్కనబెట్టాలి. డొనాల్డ్ ట్రంప్ ఆ పని చేస్తారని భావిస్తున్నాం. టెక్నాలజీ ప్రాధాన్యంగా ఇన్నోవేషన్ ఎజెండా' ను ట్రంప్ వచ్చే అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశ పెడతారని భావిస్తున్నాం' అని చెప్పారు. హెచ్ 1 బీ వీసాలను పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నదని తెలిపారు.

గతంలోనూ వీసాల పెంపు ప్రతిపాదన తెచ్చిన ఓరియన్ హేచ్

గతంలోనూ 2015లో ఇదే ప్రతిపాదనను సెనెటర్ ఓరియన్ హేచ్ ముందుకు తెచ్చారు. మార్కెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా హెచ్ 1 బీ వీసాలను 1.15 లక్షల నుంచి 1.95 లక్షలకు పెంచాలని ప్రతిపాదిస్తూ బిల్లును తీసుకొచ్చారు. అయితే అమెరికాలో అత్యంత నిపుణుల ఇమ్మిగ్రేషన్‌ ప్రభావం అమెరికన్ల ఉద్యోగాలపై పడుతుందని కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయని, కానీ సంస్కరణలు ఆమోదించాల్సిందేనని తెలిపారు.

Republican Senator thinks Donald Trump will not weaken H-1B visa system, here’s why

హై స్కిల్డ్ గెస్ట్ వర్కర్ ప్రోగ్రాం అమలుతో పూర్తిస్థాయి ఉద్యోగాల ప్రగతి, ఆర్థిక ఉత్పాదకతలో ప్రాముఖ్యానికి డొనాల్డ్ ట్రంప్ గుర్తింపు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని ఓరియన్ హేచ్ చెప్పారు. అమెరికా ఐటీ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశీ శరణార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ఇందులో హెచ్ - 1 బీ వీసా గల వారే ఎక్కువ.

అమెరికాలో నిపుణుల కొరత

తొలుత తమ దేశంలో సేవలందిస్తున్న సంస్థలు తమ దేశీయులనే నియమించుకోవాలన్న వాదన తెస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధానంతో స్థానికంగా నిపుణులు, ప్రతిభావంతుల కొరత ఎదురవుతున్నది. ఆ దేశంలో సేవలందిస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, విప్రో తదితర భారతీయ ఐటి దిగ్గజాలు అమెరికన్లను మాత్రమే నియమించుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. హెచ్ 1 బీ వీసాపై భారీగా తరలివస్తున్న భారత ఐటీ నిపుణులను నియంత్రించేందుకు వీసా విధానాన్ని కఠినతరం చేయాలని ఆయన భావిస్తున్నారు. అమెరికా రెవెన్యూలో 60% భారతీయ ఐటీ దిగ్గజాలదే.

కొత్త బిల్లు ఆమోదం పొందితే వీసా కష్టమే

ఎప్పటికప్పుడు భారత ఐటీ కంపెనీలు తాజాగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి నియమించుకుంటున్నాయి. అమెరికా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసిన చైనీయులు, భారతీయ స్టెమ్ విద్యార్థ్యులను ఐటీ నిపుణులుగా నియమించుకుంటున్నాయని నాస్కామ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్ తెలిపారు. ఏటా అమెరికా విద్యా సంస్థల నుంచి ఇంజినీరింగ్, ఉత్పాదక, నిర్మాణ రంగాల నుంచి వచ్చే ఏడాది నాటికి 2,37,826 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు.

అమెరికా కార్మిక శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సగం ఐటి రంగానికి చెందినవే. ప్రస్తుతం స్టెమ్ రంగంలో భారతీయు విద్యార్థులు 80% మంది ఉంటారు. ఒకవేళ కొత్త బిల్లు ఆమోదం పొందితే వర్క్ వీసా పొందడం వారికి కష్ట సాధ్యమవుతుంది.

అమెరికా వెళనున్న నాస్కామ్
భారత, అమెరికా ఐటి పరిశ్రమ మధ్య సంబంధాలు సజావుగా సాగేందుకు.. అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు భారత ఐటీ కంపెనీల సారథ్యంలో నాస్కామ్ ప్రతినిధి బ్రుందం త్వరలో అమెరికాకు వెళ్లనున్నది. హెచ్ సిఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ స్పందిస్తూ అమెరికన్లకు నైపుణ్యంలో శిక్షణపై భిన్నంగా స్పందించారు. వేల మంది భారతీయులకు 90 రోజుల్లో శిక్షణ ఇవ్వగలిగినప్పుడు అమెరికాలో ఎందుకు శిక్షణ ఇవ్వలేమని ప్రశ్నించారు. విశాఖ, లక్నో, నాసిక్, నాగ్ పూర్, కోయంబత్తూర్ పట్టణాల్లో స్థానికులకు ఉపాధి కల్పించినట్లే అమెరికాలోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలని చెప్పారు. దీనివల్ల కంపెనీలు భారీ స్థాయిలో ఇన్సెంటివ్ లు పొందొచ్చునని వినీత్ నాయర్ తెలిపారు.

ముందుగా స్థానికుల్లో నైపుణ్యం పెంపొందించాలి

స్థానికులకే ఉపాధి కల్పించాలని అమెరికా భావిస్తే ముందుగా సరిపడినంత మందికి శిక్షణ ఇచ్చుకోవాలని ఓ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు సూచించారు. అంతే గానీ హెచ్ 1 బీ వీసా కింద విదేశీ నిపుణుల నియామకంపై ఆంక్షలు విధించడం సబబు కాదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీలో పనిచేస్తున్న ఫర్హాన్ సేథ్నా వ్యాఖ్యానించారు. విదేశీ వర్కర్లు వద్దని భావిస్తే ముందుగా అమెరికన్లలో మ్యాథ్స్, సైన్స్ తదితర అంశాలపై ప్రోత్సాహకాలు పెంపొందించాలే గానీ, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పై కాదన్నారు.

English summary
A powerful Republican Senator has said he does not expect President Donald Trump to weaken the H-1B visa scheme, sought-after by Indian IT professionals, as the programme benefits Americans and the US economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X