వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొక్కబోర్లా పడ్డ ట్రంప్... ఎన్నికలనే బద్నాం చేస్తారా..? సొంత పార్టీ నేతలే విబేధిస్తున్న వేళ...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమిని ప్రస్తుత అధ్యక్షుడు,రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. లీగల్‌గా అయితే ఈ ఎన్నికల్లో తానే గెలిచానని ప్రకటించుకున్న ట్రంప్... కౌంటింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని కోర్టుకెక్కి అక్కడ కూడా బోల్తా పడ్డారు. ట్రంప్‌వి నిరాధారణ ఆరోపణలేనని కోర్టులు ఆయన పిటిషన్లను కొట్టిపారేశాయి. ఆఖరికి సొంత పార్టీలోనూ ట్రంప్ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ రిపబ్లికన్ పార్టీ నేతలే ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?

ట్రంప్‌పై రిపబ్లికన్ల మండిపాటు...

ట్రంప్‌పై రిపబ్లికన్ల మండిపాటు...

'గురువారం(నవంబర్ 5) రాత్రి వైట్ హౌస్ నుంచి అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం టీవీలో చూశాను. నిజానికి ఆయన స్పీచ్ వినడం చాలా కష్టంగా అనిపించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసం జరిగిందని... విజయాన్ని తమ నుంచి లాగేసుకున్నారని ట్రంప్ ఆరోపించారు. కానీ అవేవీ నిరూపించబడలేదు.' అని యూఎస్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నేత పాట్ టూమే అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికైతే రాలేదన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం : రిపబ్లికన్ నేత ఆడమ్

ట్రంప్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం : రిపబ్లికన్ నేత ఆడమ్

టెక్సాస్‌కి చెందిన రిపబ్లికన్ నేత విల్ హర్డ్ కూడా ట్రంప్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల ప్రక్రియపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా ప్రజాస్వామ్య పునాదులను తక్కువగా అంచనా వేయడమేనన్నారు. ఇల్లినాయిస్‌కి చెందిన రిపబ్లికన్ నేత ఆడమ్ మాట్లాడుతూ... ట్రంప్ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉన్నాయన్నారు. మేరీలాండ్ గవర్నర్,రిపబ్లికన్ నేత లారీ హోగన్ కూడా ట్రంప్‌ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ట్రంప్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎప్పటిలాగే ఫలితాలను గౌరవించాలన్నారు. ప్రజాస్వామ్యం కంటే వ్యక్తులు ముఖ్యం కాదన్నారు.

ట్రంప్ విషయంలో... చీలిపోయిన రిపబ్లిక్ పార్టీ...

ట్రంప్ విషయంలో... చీలిపోయిన రిపబ్లిక్ పార్టీ...

ట్రంప్ విషయంలో రిపబ్లిక్ పార్టీ రెండుగా చీలిపోయింది. కొంతమంది ట్రంప్ తీరును తప్పు పడుతుంటే... మరికొంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లిక్ నేత కెవిన్ మెక్ కార్తి మాట్లాడుతూ... కీలక రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్క తేలకపోయినప్పటికీ... ఇప్పటికే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారన్నారు. మరికొందరు రిపబ్లిక్ నేతలు మాట్లాడుతూ... మెయిల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు.ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం... అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపు దాదాపుగా ఖరారైపోయింది. కీలక రాష్ట్రాలైన జార్జియా,పెన్సిల్వేనియాల్లోనూ ఆయన మ్యాజిక్ చేశారు. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లతో విజయానికి అతి సమీపంలో ఉన్నారు. మరోవైపు ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష రేసులో వెనుకబడ్డారు.

English summary
Republican reaction to President Donald Trump’s incendiary lies about voter fraud and the “stolen” 2020 presidential election ranged, with some elected GOP officials echoing the baseless claims and others denouncing them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X