వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: చివరి దశలో హెచ్ -4 వీసాల రద్దు , 70 వేల మంది ఇండియన్లు ఇంటికేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హెచ్ 4 వీసాలను రద్దు చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలను ఇచ్చింది. అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భాగస్వామ్యులకు హెచ్ 4 వీసాలను జారీ చేస్తారు. అయితే హెచ్ 4 వీసాలను రద్దు చేయాలని అమెరికా సర్కార్ భావిస్తోంది. ఈ నిర్ణయం తుది దశలో ఉందని అమెరికా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

అమెరికాలో ట్రంప్ సర్కార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు కల్పించే హెచ్ 4 వీసాల విషయంలో కూడ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే ఈ వీసాలను రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది.

చివరి దశలో హెచ్ 4 వీసాల రద్దు

చివరి దశలో హెచ్ 4 వీసాల రద్దు

అమెరికాలో పనిచేస్తున్న హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు హెచ్ 4 వీసాలను జారీ చేస్తారు. అయితే హెచ్ 4 వీసాల విషయంలో అమెరికా సర్కార్ సీరియస్ గా ంది. ఈ వీసాలను రద్దు చేయాలనే యోచనలో ఉంది. ఈ వీసాలను రద్దు చేసే నిర్ణయం చివరి దశలో ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా కోర్టుకు తెలిపింది.

ఇండియన్ టెక్కీలపై ప్రభావం

ఇండియన్ టెక్కీలపై ప్రభావం

హెచ్ 4 వీసాలను రద్దు చేస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీలపై ఆ ప్రభావం కన్పించనుంది. ఈ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ ఆసక్తిని చూపుతోంది. ఇదే విషయాన్ని అమెరికా సర్కార్ ఫెడరల్ కోర్టుకు గురువారం నాడు ప్రకటించింది. హెమ్‌లాండ్ సెక్యూరిటీ ఫెడరల్ కోర్టుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నాడు హెచ్ 4 వీసాలను రద్దు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్టు ప్రకటించింది. ఈ వీసాలను రద్దు చేస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది ఇండియన్ టెక్కీలు ఇండియా బాట పట్టాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి.

ఒబామా సర్కార్ అనుమతి

ఒబామా సర్కార్ అనుమతి

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలంలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్నవృత్తి నిపుణుల జీవిత భాగస్వామ్యులు హెచ్ 4 వీసాలతో అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ నిర్ణయానికి చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ సర్కార్ ఉంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ నేతృత్వంలోని సర్కార్ ఈ మేరకు నిర్ణక్ష్ం తీసుకొంది. హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకొంది.ఈ ప్రక్రియ చివరి దశలో ఉంది.

70 వేల మంది ఇండియన్ టెక్కీలకు షాక్

70 వేల మంది ఇండియన్ టెక్కీలకు షాక్

హెచ్ 4 వీసాలను రద్దు చేసే ప్రక్రియ చివరి దశలో ఉంది.ఈ వీసాలను రద్దు చేస్తే అమెరికాలో ఉంటూ హెచ్ 4 వీసాలపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న సుమారు 70 వేల మంది ఇండియన్ టెక్కీలు ఇక ఇంటి బాట పట్టాల్సిందే. వీరంతా అనివార్యంగా అమెరికాను వీడాల్సి వచ్చే అవకాశం లేకపోలేదు.

English summary
The move to rescind work authorisation to certain categories of H-4 visa holders is in final stages, the Trump administration has told a US court.H-4 visas are issued to the spouses of H-1B visa holders, a significantly large number of whom are high-skilled professionals from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X