వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన హెలికాప్టర్: గాలింపు చర్యలు

దక్షిణ రష్యాలోని అల్టడాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో సివిల్ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణీకులు గల్లంతయ్యారు. ఇప్పటికి వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

మాస్కో: దక్షిణ రష్యాలోని అల్టడాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో సివిల్ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులోని ప్రయాణీకులు గల్లంతయ్యారు. ఇప్పటికి వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రాబిన్‌సన్ 366 రకానికి చెందిన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్.. ఆదివారం రాత్రి టెలెట్ స్కోయ్ సరస్సు వద్ద కుప్పకూలింది.

Rescuers Searching for Crashed Helicopter in South Russia

160 మందికి పైగా సిబ్బంది సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరో 68 మంది సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపడుతున్నారన్నారు.

హెలికాప్టర్ కూలినప్పుడు అందులో మాజీ డిప్యూటీ చీఫ్ అనాటోలీ బన్యా సహా మొత్తం ఐదుగురు ప్రయాణీకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదే మాజీ డిప్యూటీ చీఫ్ గత ఎనిమిదేళ్ల క్రితం ఎంఐ 8 విమాన ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

English summary
An operation to search for a helicopter that had crashed in Russia’s southern Altai region began early Monday, an Emergencies Ministry spokesman told Sputnik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X