వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ .. కరోనా కళ్ళ ద్వారా వేగంగా వ్యాపిస్తుందన్న రీసెర్చ్ .. కళ్ళకు రక్షణ ఎలా ?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిని తరిమి కొట్టటం ఎలా ? దానికి మందు ఏంటి ? ఇప్పుడు అన్ని దేశాలు దీనిపైనే పెద్దఎత్తున పరిశోధన సాగిస్తున్నాయి. కరోనా నియంత్రణ , నివారణ కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి మెడిసిన్ లేని కరోనాను అరికట్టటం కోసం మెడిసిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్న వారు కొందరైతే కరోనా లక్షణాలపై, కరోనా వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న వారు కొందరు. అయితే ఈ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Recommended Video

Corona Spreading With Eyes : Research

ఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీ

 కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కళ్ళ ద్వారా కూడా కరోనా వస్తుందన్న రీసెర్చ్

కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కళ్ళ ద్వారా కూడా కరోనా వస్తుందన్న రీసెర్చ్

మానవ శరీరాల్లో కరోనా మాత్రం వివిధ అవయవాల మీద కరోనా తన ప్రభావాన్ని ఏ విధంగా చూపిస్తుంది అని అనేక అధ్యయనాలు జరిగాయి. ఇక తాజాగా కరోనా వ్యాప్తి కళ్ళద్వారా కూడా జరుగుతుందా ? అని చేసిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. కరోనా వైరస్ ముక్కు, నోటిద్వారా శరీరంలోకి ఎంటర్ అవుతుంది అని ఇప్పటి వరకు అందరికీ తెలుసు . అయితే కరోనా కళ్ళ ద్వారా కూడా వ్యాపిస్తుంది అని తాజా రీసెర్చ్ తేల్చి చెప్పింది.

కళ్ళతో వేగంగా కరోనా వ్యాప్తి .. హాంకాంగ్ శాస్త్రవేత్తల రీసెర్చ్

కళ్ళతో వేగంగా కరోనా వ్యాప్తి .. హాంకాంగ్ శాస్త్రవేత్తల రీసెర్చ్

ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపించి శ్వాసవ్యవస్థపై దాడి చేసి మనిషిని చంపేస్తుంది. అందుకే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ముక్కు, నోటికి అడ్డుగా మాస్క్ ను ధరించాలని చెప్పారు. అయితే ఈ మాస్క్ అడ్డుగా ఉన్నంత వరకు కరోనా లోపలికి ఎంటర్ కాలేదని అంతా భావించారు. అంతే కాదు చేతులను శుభ్రంగా కడుక్కోవటం వంటి చర్యల ద్వారా కూడా కరోనా రాకుండా ఉండొచ్చు అని చెప్పుకుంటూ వచ్చాం . అయితే, ముక్కు, నోరు కంటే వేగంగా కరోనా కళ్ళ ద్వారా వ్యాపిస్తున్నట్టు హాంకాంగ్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

 సార్స్ వైరస్ కంటే 100 రెట్లు అధికంగా దాడి

సార్స్ వైరస్ కంటే 100 రెట్లు అధికంగా దాడి

కళ్ళతో కరోనా చాలా డేంజరస్ గా వ్యాప్తి చెందుతుంది అని వారి రీసెర్చ్ లో తేల్చేశారు . కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి చూపు ద్వారా కళ్లపై ఉన్న కాంజంక్టివా అనే సన్ననిపొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ వైరస్ సార్స్ వైరస్ కంటే 100 రెట్లు అధికంగా దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సంచలన విషయాలు బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది . ఇక కంటి నుండి కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అంటే అది కంట్రోల్ చెయ్యటం ఎలా అన్న దానిపై ఇప్పుడు అందరూ దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది .

ముక్కు , నోటికి మాస్కులు ఓకే ... కళ్ళకు రక్షణ ఎలా ?

ముక్కు , నోటికి మాస్కులు ఓకే ... కళ్ళకు రక్షణ ఎలా ?

సహజంగా మనుషులు కంటిని పదేపదే టచ్ చేస్తూ ఉంటాడు. ప్రతి గంటకు కనీసం 16సార్లు కంటిని టచ్ చేస్తూ ఉంటారని ఒక లెక్క . ఇక ఇలాంటి సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కంటి నుండి చూపు ద్వారా కంటి పై వైరస్ దాడి చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి.? ఎలా కంటి ద్వారా కరోనా రాకుండా కాపాడుకోవాలి అనే దానిపై అంతా దృష్టి పెట్టాలి. ముఖం మొత్తానికి ప్లాస్టిక్ కవర్ క్యాప్ లా తయారు చేసుకుని ,వాటితో పాటు వైరస్ అటాక్ చెయ్యకుండా కళ్ళజోడు వంటి వాటిని ధరిస్తే కరోనా కంటి ద్వారా వ్యాప్తి చెందటం ఆగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Research has shown that the corona can spread with the eyes very dangerously. Hangkong Scientists have discovered that persons with a corona-positive gaze invades a narrow space called the conjunctiva in the eyes. The virus has been found to attack 100 times more than the saurce virus. With these sensational research coming out, the world was in a tension now .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X