• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాక్: బ్రిటన్ రాకుమారుడి పెళ్లి: ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలట!

|

లండన్: బ్రిటన్‌ రాకుమారుడు హ్యారీ, ప్రముఖ హాలీవుడ్ నటి మేఘన్‌ మార్కెల్‌ల వివాహంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మే 19న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కాగా, ఈ వేడుకకు సంబంధించిన ఓ సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వీరి ప్రేమే ఓ సంచలనం: ప్రిన్స్ హెన్రీ-మేఘన్‌ల పెళ్లి డేట్ ఇదే

వచ్చేవారందరికీ వంటకాలు చేయడం లేదు

వచ్చేవారందరికీ వంటకాలు చేయడం లేదు

బ్రిటన్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌ రాయల్‌ ప్యాలెస్‌లో వివాహ వేడుకను నిర్వహించనున్నారు. అయితే రాకుమారుడి పెళ్లంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్లుచెదిరే ఏర్పాట్లు, వేలాది అతిథులతో సందడిగా ఉంటుంది. అతిథుల కోసం ఎంత కాదన్నా వందల రకాల వంటకాలు ఉంటాయి. కానీ, ప్రిన్స్ హ్యారీ వివాహ వేడుకలో మాత్రం అంత పెద్ద మొత్తంలో వంటకాలు చేయడం లేదట.

ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలి..

ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలి..

పెళ్లికి వచ్చేవారికి కేవలం అల్పాహారం మాత్రమే పెడతారట. భోజనాలు ఇంటి నుంచే తెచ్చుకోవాలని కెన్సింగ్‌టన్‌ ప్యాలెస్‌ అధికారులు మీడియా ద్వారా వెల్లడించడం గమనార్హం. ఈ వివాహానికి ముందు జరిగే పార్టీకి 2,640 మంది అతిథులు హాజరుకాబోతున్నారు. వారిలో 1200 మంది బ్రిటన్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా హాజరుకానున్నట్లు తెలిసింది.

అతిథులు పరిమితం.. విందు కూడా

అతిథులు పరిమితం.. విందు కూడా

కాగా, వివాహానికి మాత్రం కేవలం 600 మంది అతిథిలను మాత్రమే ఆహ్వానించారు. ఆ తర్వాత రాణి ఎలిజబెత్‌-2 విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందు తర్వాత ప్రిన్స్‌ చార్లెస్‌‌ మరో 200 మంది అతిథితులకు విందు ఇవ్వనున్నారు. అంతా బాగానే ఉంది కానీ, రాజకుటుంబానికి చెందినవారై కూడా అతిథులను ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని చెప్పడం వింతగా ఉండటంతోపాటు చర్చనీయాంశంగా మారింది.

 ప్రిన్స్ హ్యారీది ప్రేమ పెళ్లే..

ప్రిన్స్ హ్యారీది ప్రేమ పెళ్లే..

ఇది ఇలావుంటే, బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్‌కు అంతర్జాతీయ మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఏకంగా 2016 ఏడాదికి గానూ మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా మేఘన్ రికార్డు సృష్టించింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్‌ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు. 2016వ సంవత్సరం జులై నెలలో ‘సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరిద్దరి పరిచయం జరిగింది. అక్కడే వీరి తొలి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
embers of the public with a ‘golden ticket’ to the royal wedding have been told to provide their own picnic lunch. Prince Harry and Meghan Markle have invited 2,460 people “to feel part of the celebrations” by standing in the grounds of Windsor Castle on the big day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more