వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా శాంతి చిహ్నాలుగా సత్యార్ధి, మలాలా: అమెరికా సెనేట్ తీర్మానం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న కైలాశ్ సత్యార్థి, మలాలా యూసుఫ్‌జాయ్‌లకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. వీరిద్దరిని శాంతి చిహ్నాలుగా గుర్తించేందుకు ఆ దేశ సెనేట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

Resolution in US Senate to Honour Kailash Satyarthi, Malala Yousafzai

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి ఇప్పటికే 82 వేల మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని సెనేట్ ఆ తీర్మానంలో పేర్కొంది. 11 ఏళ్ల చిన్న వయసు నుంచే మలాలా బాలికల విద్య కోసం కృషి చేసిందని వివరించారు. సెనేటర్ టామ్ హార్కిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

మంగళవారం ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో బహుమతి ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
In acknowledgement of their efforts to end the financial exploitation of children and to ensure the right of all children to an education, a US Senate resolution has been introduced to recognise Nobel laureates Kaliash Satyarthi and Malala Yousafzai as "symbols of peace."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X