వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

800కి.మీ. ప్రయాణించి పిజ్జా డెలివరీ చేసిన రెస్టారెంట్ ఉద్యోగి, ప్రశంస: ఎందుకంటే, కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

మిచిగాన్: ఓ పిజ్జా కార్నర్‌లో పని చేసే ఉద్యోగి ప్రశంసలు అందుకుంటున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి 800 కిలో మీటర్ల దూరం ప్రయాణించి పిజ్జాను డెలివరీ చేశాడు. ఈ సంఘటన అమెరికాలోని మిచిగాన్‌లో జరిగింది. సమాచారం మేరకు.. జూలీ, రిచ్ మోర్గాన్‌లు 25 ఏళ్లుగా మిచిగాన్‌లో ఉంటున్నారు.

వారు ప్రతి రోజు స్టీవ్స్ పిజ్జాలను తిని ఆనందించేవారు. ఈ జంట అక్కడి నుంచి ఇండియన్‌పోలిస్‌కు మకాం మార్చిన తర్వాత కూడా స్టీవ్స్ పిజ్జా సెంటర్‌ను మరిచిపోలేదు. స్టీవ్స్ పిజ్జాపై జూలీ మోర్గాన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.

ఈ అద్భుతాన్ని నమ్ముతారా?: వెనక్కి వెళ్లిన జలపాతం, కారణం ఇదేఈ అద్భుతాన్ని నమ్ముతారా?: వెనక్కి వెళ్లిన జలపాతం, కారణం ఇదే

పిజ్జా కోసం మిచిగాన్ వెళ్లాలని భావించారు కానీ

పిజ్జా కోసం మిచిగాన్ వెళ్లాలని భావించారు కానీ


ఆ తర్వాత ఓసారి పిజ్జా కోసం వారు మిచిగాన్ వెళ్లాలని భావించారు. కానీ అనుకోకుండా వారి ప్రయాణం మారిపోయింది. రిచ్ మోర్గాన్ ఐదు రోజుల పాటు ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందాడు. అక్కడే క్యాన్సర్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని జూలీ చెప్పింది. ఆ సమయంలో జూలీ తండ్రి సదరు పిజ్జా కార్నర్‌కు ఫోన్ చేశాడు. రిచ్ మోర్గాన్‌కు పిజ్జా పంపించలగరా అని అడిగారు. అప్పుడు పిజ్జా కార్నర్ మేనేజర్.. అతని పరిస్థితి తెలిసి పిజ్జాను పంపించాలని నిర్ణయించారు.

పిజ్జా సెంటర్ మేనేజర్ ఔదార్యంపై ఫేస్‌బుక్‌లో జూలీ

పిజ్జా సెంటర్ మేనేజర్ ఔదార్యంపై ఫేస్‌బుక్‌లో జూలీ


పిజ్జా సెంటర్ స్పందనపై జూలీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. తన తండ్రి ఫోన్ చేయగానే పిజ్జా సెంటర్ మేనేజర్ డాల్టన్ ఎలాంటి సంశయం లేకుండా ఏరకమైన పిజ్జా కావాలని అడిగారని, అప్పుడు తన తండ్రి తాము ఇండియన్‌పోలిస్‌లో ఉన్నట్లు చెప్పారని, పిజ్జా కార్నర్ నుంచి తమ వద్దకు రావాలంటే తక్కువలో తక్కువ మూడున్నర గంటలకు పైగా సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు. పిజ్జాను ఆర్డర్ చేయగానే మేనేజర్ డాల్టన్ స్పందిస్తూ.. స్టోర్ క్లోజ్ చేయగానే పంపిస్తామని చెప్పారని అందులో జూలీ పేర్కొన్నారు.

 ఆ సమయంలో పిజ్జా ఆర్జర్

ఆ సమయంలో పిజ్జా ఆర్జర్

తాను, రిచ్ మోర్గాన్ నిద్రించామని, అర్ధరాత్రి గం.2.30 నిమిషాలకు డాల్టన్ మరో రెండు ప్రత్యేక అదనపు పిజ్జాలతో తమ ఇంటికి వచ్చాడని జూలీ పేర్కొంది. వారు పిజ్జాను అంతదూరం తెచ్చినందుకు జూలీ ఆనందపడ్డారు. వారిపై ప్రశంసలు కురిపించారు. జూలీ ఫేస్‌బుక్‌లో ఆ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు కూడా మేనేజర్ డాల్టన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన 500 మైళ్లు అంటే దాదాపు 800 కిలో మీటర్లు ప్రయాణించి, డెలివరీ చేశారని తెలుస్తోంది.

 మేనేజర్ ఏమన్నాడంటే?

మేనేజర్ ఏమన్నాడంటే?

జూలీ నాలుగైదు రోజుల క్రితం దీనిని పోస్ట్ చేశారు. వేలాది మంది దీనిని షేర్ చేశారు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని, గుండెను టచ్ చేశావని.. ఇలా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నేను వారికి వెళ్లి డెలివరీ చేయాలనుకున్నానని, వారిని సంతోషపెట్టాలని అనుకున్నానని, అందుకు తనకు కూడా హ్యాపీగా ఉందని డాల్టన్ చెప్పారు.

English summary
A pizzeria employee in Michigan, USA, went out of his way very literally - to deliver pizza to to a man battling cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X