వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మదర్స్ డే రోజు ఆ తల్లికి అపూర్వ కానుక.. ఆశలు వదిలేసుకున్న 32 ఏళ్ల తర్వాత..

|
Google Oneindia TeluguNews

చైనాలో చిన్నతనంలోనే కిడ్నాప్‌కు గురైన ఓ వ్యక్తి 32 ఏళ్ల తర్వాత తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. కిడ్నాప్‌కు గురైన కొడుకు ఆచూకీ కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. తల్లి తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి తన కొడుకు ఆచూకీ కనిపెట్టడం కోసం కొన్ని ఏళ్ల పాటు శ్రమించింది.ఈ క్రమంలో ఆ దంపతులు లక్ష పాంప్లెట్లు పంచారు. కుమారుడి ఆచూకీ కోసం పలు టీవీ చానెళ్ల ద్వారా కూడా పలుమార్లు విన్నతులు చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసులకు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆ తల్లిదండ్రులను, వారి కొడుకును తిరిగి ఏకం చేసింది.

రెండేళ్ల వయసులో కిడ్నాప్‌..

రెండేళ్ల వయసులో కిడ్నాప్‌..

షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్‌లో ఫిబ్రవరి 23,1986లో మావో జెంజింగ్-లీ జింగ్జీ దంపతులకు మావో ఇన్ అనే కుమారుడు జన్మించాడు. మావో ఇన్ రెండేళ్ల వయసులో అక్టోబర్ 17,1988న అతన్ని తన తండ్రి నర్సరీ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా తనకు దాహమవుతోందని చెప్పాడు. దీంతో ఓ హోటల్ ఎంట్రన్స్ దగ్గర ఆగిన తండ్రి.. నీళ్లు తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లాడు. కాసేపటికి నీళ్లతో బయటకు రాగా.. మావో ఇన్ ఎక్కడా కనిపించలేదు.

లక్ష పాంప్లెంట్స్.. టీవీ షోల్లోనూ విజ్ఞప్తి..

లక్ష పాంప్లెంట్స్.. టీవీ షోల్లోనూ విజ్ఞప్తి..


జియాన్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆ కుటుంబం మావో ఇన్ కోసం గాలించింది. కానీ ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో అతని తల్లి లీ-జింగ్జీ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ మావో ఇన్‌ను వెతకడం పైనే ఫోకస్ పెట్టింది. అలా దాదాపు 10 ప్రావిన్స్‌లు,మున్సిపాలిటీల్లో దాదాపు 1లక్ష పాంప్లెంట్స్ పంచింది. కానీ ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఆఖరికి పలు టెలివిజన్ టీవీ షోల ద్వారా కూడా తన కొడుకు ఆచూకీ కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో తన కొడుకును పోలిన 300 మందిని కలుసుకుంది. కానీ, వారిలో తమ కుమారుడు లేడని డీఎన్ఏ పరీక్షల్లో రుజువైంది.

ఆశలు వదిలేసుకున్నాక..

ఆశలు వదిలేసుకున్నాక..


చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి.. ఇక ఆశలు వదిలేసుకున్న లీ-జింగ్జీ తనలాంటి కష్టం ఇతర తల్లిదండ్రులకు రావొద్దని 'బేబీ కమ్ బ్యాక్ హోమ్' అనే సంస్థలో వలంటీర్‌గా చేరింది. దాని ద్వారా చిన్నతనంలో తప్పిపోయిన దాదాపు 29 మందిని తిరిగి వారి కుటుంబాల చెంతకు చేర్చింది. ఇప్పటికీ అదే గ్రూపుతో పనిచేస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సిచుయాన్ ప్రావిన్స్‌ నుంచి జియాన్‌లోని పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ ఓ వ్యక్తి ఒకతన్ని దత్తత తీసుకున్నాడని అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

మదర్స్ డే రోజు.. అపూర్వ కానుక...

మదర్స్ డే రోజు.. అపూర్వ కానుక...


అతనిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ ప్రాంతానికి వెళ్లి గు నింగ్నింగ్ అనే వ్యక్తికి డీఎన్ఏ పరీక్షలు చేసి.. మావో జెంజింగ్, లీ-జింగ్జీ దంపతుల డీఎన్ఏతో పోల్చి చూశారు. ఇద్దరి డీఎన్ఏలు మ్యాచ్ కావడంతో అతనే మావో ఇన్ అని నిర్దారించారు. చిన్నతనంలో అతన్ని అపహరించిన కిడ్నాపర్స్ పిల్లలు లేని ఓ తల్లిదండ్రులకు 6వేల యువాన్లకు అతన్ని అమ్మేసినట్టు గుర్తించారు. గు నింగ్నింగ్ కూడా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎక్కవ సమయం గడపాలనుకుంటున్నానని చెప్పాడు. యాథృచ్చికంగా మే 10,మదర్స్ డే రోజే మావో ఇన్ తిరిగి తన తల్లిదండ్రులకు చేరాడు. జీవితంలో తాను పొందిన అతిపెద్ద కానుక ఇదేనంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి 32 ఏళ్ల ఆ తల్లిదండ్రుల నిరీక్షణ చివరికిలా సుఖాంతమైంది.

English summary
A Chinese man who was abducted aged 2 from a hotel in 1988 has finally been reunited with his parents after 32 years.Mao Yin was taken from his parents in 1988 when he was two years old while outside of a hotel in the Chinese city of Xi'an, in Shaanxi province. He was then sold to a childless couple in the neighboring Sichuan province
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X