వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: యువతని సూసైడ్ బాంబర్లుగా ఎలా మారుస్తున్నారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: వివిధ ప్రాంతాల్లో ఉండేవారు.. తమ ఆప్తులు, సన్నిహితులతో మాట్లాడేందుకు స్కైప్, వీడియా కాన్ఫరెన్స్‌లను వినియోగిస్తుంటారు. అయితే, వీటిని తీవ్రవాదులు కూడా ఉపయోగించుకొని.. యువతను ఐసిస్ వైపు మళ్లించడం, శిక్షణ ఇవ్వడం కూడా చేస్తున్నాయి.

సమాచారం మేరకు.. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది... ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ వైపు ఆకర్షితులయ్యే యువతకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాడు. భారత దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదని చెబుతున్నారు.

ముంబై యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) పలువురు ఐసిస్ సానుభూతిపర అనుమానితులను అదుపులోకి విచారించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

Revealed: How IS trained Indian youth

పోలీసులు విచారిస్తున్న అనుమానితుల్లో ఒకడు ఐసిస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అతను విచారణలో ఈ విషయం చెప్పాడని తెలుస్తోంది. స్కైప్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు.

ఐసిస్ వైపు ఆకర్షితులైన ముంబై యువతను సుసైడ్ బాంబర్లుగా మార్చడం కోసం ఐసిస్ చీఫ్ బాగ్దాది ప్రత్యేక ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నాడని తెలుస్తోంది. తద్వారా దేశంలో టెర్రర్ యాక్టివిటీస్‌ను పురిగొల్పుతున్నాడు. మరో విషయమేమంటే ఈ శిక్షణకు మహిళలు కూడా వచ్చారని చెప్పాడని తెలుస్తోంది.

'డబ్బులిస్తాం.. ఐఎస్‌ఐలో చేరు': బిహార్‌ విద్యార్థికి పాక్‌ నుంచి ఫోన్‌

పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐలో చేరితే పెద్దమొత్తం నగదు ఇస్తామని పాకిస్తాన్ నుంచి ఓ విద్యార్థికి వచ్చిన ఫోన్ కాల్‌ బిహార్‌లో కలకలం రేపింది. స్థానికంగా ఇంటర్‌ చదువుతున్న ముఖేశ్ కుమార్‌ సెల్‌ఫోన్‌కు శుక్రవారం ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. మొదట్లో స్పందించలేదు.

రెండోసారీ మోగడంతో తీశాడు. అవతలి వైపు నుంచి మేం పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ నుంచి మాట్లాడుతున్నామని, మా సంస్థలో చేరితే భారీమొత్తం నగదు ఇస్తామని ఆశ చూపారు. దాన్ని తిరస్కరించిన ముఖేశ్‌ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడని ఖైమూర్‌ ఎస్పీ తెలిపారు.

English summary
Skype, video conferences through other channels have become very popular among everyone as the medium help people to connect with others, despite being in different locations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X