వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుని సంస్కరిస్తానన్నాడు... స్విస్ బ్యాంకులో కోట్లు దాచుకున్నాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: స్కామ్‌ల్లో కూరుకుపోయిన హెచ్ఎస్‌బీసీ బ్యాంకును సంస్కరిస్తానని ఇన్ని రోజులుగా చెప్పుకొస్తున్న ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కొన్ని వేల కోట్లు రూపాయలు దాచుకున్నారని లండన్‌కు చెందిన ప్రముఖ వార్తా పత్రిక గార్డియన్ బయటపెట్టింది.

ఈ ఏడాది మే నెలలో గ్రేట్ బ్రిటన్‌కు ఎన్నికలు జరగుతుండటంతో ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డబ్బున్న ధనవంతులు ప్రభుత్వాలకు పన్ను ఎగొట్టేందుకు స్విస్ బ్యాంకుల్లో నగదు దాచుకుంటున్న విషయం తెలిసిందే.

Revealed: Swiss account secret of HSBC chief Stuart Gulliver

ఇదే తరహాలోస్టువర్ట్ గలివర్ కూడా 2007వ సంవత్సరంలో 7.6 మిలియన్ డాలర్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరు మీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు వార్తా కథనం ప్రచురించింది. ఉద్యోగ జీవితంలో అందిన బోనస్‌లను దాచుకునేందుకే స్టువర్ట్ గలివర్ స్విస్ ఖాతాను వినియోగిస్తున్నారని ఆయన ప్రతినిధి తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన స్టువర్ట్ గలివర్ ప్రస్తుతం న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్‌లో నివసిస్తున్నారు. అయితే గార్డియన్ పత్రిక ప్రచురించిన ఈ స్విస్ బ్యాంకు ఖాతా వ్వవహారంపై హెచ్ఎస్‌బీసీ బ్యాంకు వర్గాలు ఇంకా స్పందించక పోవడం విశేషం.

English summary
Stuart Gulliver, the HSBC chief executive who has vowed to reform the crisis-hit bank, sheltered millions of pounds in a Swiss account through a Panamanian company and remains tax domiciled in Hong Kong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X