India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Revlon: బ్యూటీ మార్కెట్‌ను షేక్ చేసిన ఈ కంపెనీ దివాలా తీయడానికి కారణాలేంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రెవ్లాన్

రెవ్లాన్ కంపెనీ దశాబ్దాల కాలం పాటు కాస్మోటిక్ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కానీ, గురువారం ఈ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటిస్తూ అమెరికాలోని కోర్టులో పత్రాలు సమర్పించింది.

అయితే, మార్కెట్‌లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

''దశాబ్ధాలుగా మా ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చాం. ఈ ప్రకటన, వినియోగదారులకు ఐకానిక్ ఉత్పత్తులను అందించేందుకు రెవ్లాన్‌ను అనుమతిస్తుంది. అలాగే మా భవిష్యత్ వృద్ధికి స్పష్టమైన మార్గాన్ని కూడా కల్పిస్తుంది'' అని కంపెనీ సీఈవో డెబ్రా పెరెల్‌మన్ అన్నారు.

కోర్టు నుంచి ఆమోదం లభించిన తర్వాత ఉత్పత్తిని కొనసాగించేందుకు తమ ఫైనాన్షియర్ల నుంచి 575 మిలియన్ డాలర్ల (రూ. 4,482 కోట్లు)ను వినియోగించుకుంటామని కంపెనీ ప్రకటించింది.

సరఫరా వ్యవస్థలో అంతరాయం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ప్రపంచ సవాళ్ల కారణంగా ద్రవ్య లభ్యతలో పరిమితులను ఎదుర్కొంటున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే రెవ్లాన్ హెచ్చరించింది.

రెవ్లాన్

మార్చి చివరి నాటికి కంపెనీకి 3.3 బిలియన్ డాలర్ల (రూ. 25,723 కోట్లు) దీర్ఘకాలిక అప్పు ఉంది. కంపెనీ దివాలాకు సంబంధించిన నివేదికలు రావడంతో గత వారం కంపెనీ షేరు ధర పడిపోయింది.

ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో రెవ్లాన్ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. అయినప్పటికీ మార్కెట్‌లో దాని స్థానానికి దెబ్బపడింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరు పొందిన ఈ కంపెనీ ర్యాంకు ఇప్పుడు 22వ స్థానానికి పడిపోయింది.

ఈ ఐకానిక్ బ్రాండ్ దివాలా ప్రకటించడం వెనుక మరికొన్ని కారణాలు ఉన్నాయి.

రెవ్లాన్

కొత్త పోటీదారుల ఆవిర్భావం

రెవ్లాన్ పతనం 1990ల్లోనే ప్రారంభమైంది. మారుతోన్న వినియోగదారుల ప్రాధాన్యాలను అందిపుచ్చుకోవడంలో కంపెనీ విఫలం కావడంతో ఈ పతనం మొదలైంది. వినియోగదారులు కోరుకునే ప్రకాశవంతమైన ఎరుపు రంగు వైపు కాకుండా ముదురు రంగు లిప్‌స్టిక్ షేడ్స్ వైపే కంపెనీ మొగ్గింది.

ఈ అంతరమే మిగతా పోటీదారులకు అనుకూలంగా మారింది.

రెవ్లాన్, ఎన్నో ఏళ్లుగా పోటీలో ఉన్న సంప్రదాయ ప్రత్యర్థులకు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యక్తులు కొత్తగా ఏర్పాటు చేసిన ఫెంటీ బ్యూటీ, కైలీ కాస్మోటిక్స్ వంటి కొత్త బ్రాండ్‌లకు కూడా తమ మార్కెట్ షేరును కోల్పోతోంది.

సరఫరా వ్యవస్థ సమస్యలు

సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా కాస్మోటిక్స్ తయారీలో వాడే పదార్థాలకు తీవ్ర పోటీ ఏర్పడిందని రెవ్లాన్ చెప్పింది.

దీంతో ఆర్డర్ల కోసం ముందస్తుగా చెల్లింపులు జరపాలని పంపిణీదారులు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితి, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అవసరమైన వస్తువుల కొరతకు దారితీసిందని రెవ్లాన్ రీస్ట్రక్చరింగ్ డైరెక్టర్ రాబర్ట్ కరుసో, అమెరికా కోర్టులో దాఖలు చేసిన ఫైళ్లలో పేర్కొన్నారు.

''ఉదాహరణకు ఒక రెవ్లాన్ లిప్‌స్టిక్ తయారీకి 35 నుంచి 40 ముడి పదార్థాలు అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురాలేం'' అని ఆయన వాటిలో పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇతర కంపెనీల తరహాలోనే రెవ్లాన్‌పై కూడా ఉద్యోగుల కొరత ప్రభావం చూపింది.

దీనితో పాటు కంపెనీ అమ్మకాలు 2020లో 21 శాతానికి పడిపోయాయి. గత ఏడాది 9.2 శాతం పుంజుకున్నప్పటికీ, కరోనా రాకముందు ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు దాని ఆదాయం ఇంకా 2.4 బిలియన్ డాలర్లు (రూ. 18,708 కోట్లు) తక్కువగానే ఉంది.

1979లో పారిస్‌లోని రెవ్లాన్ స్టోర్. 1950ల్లో ఇది అంతర్జాతీయ బ్రాండుగా మారింది.

అంతర్జాతీయ బ్రాండ్

రెవ్లాన్‌ను 1932లో చార్లెస్, జోసెఫ్ రావ్సన్ అనే సోదరులు చార్లెస్ లాచ్‌మన్‌తో కలిసి స్థాపించారు.

వెంటనే ఈ కంపెనీ నెయిల్ పాలిష్‌లను అమ్మడం మొదలుపెట్టింది. 1950ల మధ్య నాటికి ఇది అంతర్జాతీయ బ్రాండుగా అవతరించింది.

1970లో నల్లజాతి మోడల్ అయిన సయోమి సిమ్స్‌ను కంపెనీ నియమించుకుంది. జాతి పరమైన అడ్డంకులను పట్టించుకోకుండా నల్లజాతి మోడల్‌ను నియమించుకున్న తొలి సౌందర్య కంపెనీగా రెవ్లాన్ పేరు పొందింది.

ఆ తర్వాత సిండీ క్రాఫోర్డ్, క్లాడియా షిఫర్ వంటి మోడల్స్‌తో ప్రచార కార్యక్రమాలను రూపొందించి బ్యూటీ మార్కెట్‌ను షేక్ చేసింది.

1985లో ఈ కంపెనీని వందల కోట్లకు అధిపతి అయిన వ్యాపారవేత్త రోనాల్డ్ పారెల్‌మన్‌కు చెందిన మెకండ్రూస్ అండ్ ఫోర్బ్స్ కంపెనీ కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Revlon: Why did this company, which shook the beauty market, go bankrupt?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X