వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనికి లొంగలేదు.. అందుకే వేధించాడు,ఉద్యోగం నుంచి తొలగించాడు.. ఆ సీఈవోపై ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ వీడియో గేమింగ్ కంపెనీ రాయిట్ గేమ్స్ సీఈవో నికోలో లారెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో నికోలో వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేసిన షారన్ ఓ డోనెల్ ఆయనపై ఈ కేసు పెట్టారు. ఈ మేరకు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ సుపీరియర్ కోర్టులో జనవరి 7న డోనెల్ ఫిర్యాదు చేశారు. లారెంట్‌తో లైంగిక సంబంధానికి నో చెప్పినందు వల్లే ఆయన తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లారెంట్ వద్ద పనిచేసిన సమయంలో లైంగిక వేధింపులు,వివక్షను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

పరిహారం చెల్లించాలంటున్న డోనెల్..

పరిహారం చెల్లించాలంటున్న డోనెల్..

పని ప్రదేశంలో ఇబ్బందులకు గురిచేయడం,లైంగికంగా వేధించడం,వివక్ష చూపించడం,వేతనాలు చెల్లించకపోవడం... ఇలా మొత్తం 9 రకాల సమస్యలను తాను లారెంట్ నుంచి ఎదుర్కొన్నానని షారన్ ఓ డోనెల్ తెలిపారు. వీటన్నింటికి లారెంట్ నుంచి తనకు పరిహారం అందేలా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 2017లో డోనెల్ రాయిట్ గేమింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరారు.

ఏ విషయమైనా కంపెనీ సీఈవో లారెంట్‌కు ఆమె రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాను కంపెనీలో చేరిన కొద్దిరోజులకే లారెంట్ నుంచి వేధింపులు మొదలయ్యాయని... కంపెనీని వీడేంతవరకూ వేధింపులు కొనసాగాయని డోనెల్ చెప్పారు. ఇదే క్రమంలో 2020లో తనను అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు.

అసభ్యకర మాటలతో వేధింపులు...

అసభ్యకర మాటలతో వేధింపులు...

లారెంట్ ఎప్పుడూ లైంగిక ఉద్దేశంతో తనతో అసభ్యకరంగా మాట్లాడేవాడని డోనెల్ ఆరోపించారు. అంతేకాదు,అతని ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఇంటికొచ్చి పనిచేయాలని వేధించేవాడన్నారు. 'ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను తట్టుకోగలవా..' అంటూ వెకిలి మాటలు మాట్లాడేవాడని చెప్పారు.లారెంట్‌ ప్రతిపాదనలకు తాను ఒప్పుకోకపోవడం,అతనికి లొంగకపోవడంతో తన పట్ల మరింత కక్ష పెంచుకున్నాడని చెప్పారు. తనతో అదనపు గంటలు కూడా పని చేయించుకున్నారని... కానీ వేతనం మాత్రం చెల్లించలేదని ఆరోపించారు.

స్పందించిన రాయిట్ గేమ్స్...

స్పందించిన రాయిట్ గేమ్స్...

డోనెల్ వేధింపులపై రాయిట్ గేమ్స్ స్పందించింది. 'గడిచిన కొన్ని సంవత్సరాలుగా మా కంపెనీలో పని ప్రదేశంలో ఉండాల్సిన కల్చర్‌కు మేము ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ఆ దిశగా మేము తీసుకున్న చర్యలకు మేము గర్వపడుతుంటాం. ఈ నేపథ్యంలో డోనెల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.' అని వెల్లడించింది. గతంలోనూ పలువురు ఉద్యోగులు రాయిట్ గేమ్స్ కంపెనీపై లైంగిక వేధింపులు,లింగ వివక్ష ఆరోపణలు చేయడం గమనార్హం.

English summary
League of Legends developer Riot Games and its CEO, Nicolo Laurent, are facing a sexual harassment lawsuit from the exec's former assistant.The complaint was filed in LA County Superior Court on January 7, and has now been shared by Vice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X