Road Accident: ఘోర ప్రమాదం.. 37 మంది దుర్మరణం

Road Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

లాటిన్ అమెరికాలో అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన ప్రఖ్యాత "ఒరురో కార్నివాల్"కు వెళ్తుండగా ఒరురో-ఉయుని రహదారిపై బస్సులు ఒకదాన్ని మరొకటి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లడంతోనే ప్రాణనష్టం భారీగా జరిగినట్లు తెలిపింది.

Road Accident in Bolivia 37 Killed 39 Injured in Tragic Bus Collision

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, రెస్క్యూ బృందం వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్లు ఇద్దరూ ప్రాణపాయం నుంచి తప్పించుకోగా.. ఓ డ్రైవర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఉయుని పోలీసులతో సహా స్థానిక అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని బొలీవియా పోలీసులు నిర్ధారించారు. బొలీవియా బస్సు ప్రమాదంపై ఆ దేశ ప్రభుత్వం, స్థానిక అధికారులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బొలీవియాలో ఏటా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశంలో ఏటా జరిగే ప్రమాదాల్లో సగటున 1400 మరణాలు సంభవిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+