వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరిక: అమెరికన్ ఉద్యోగాలకు పొంచివున్న భారీ ముప్పు!

ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్ది పనివారు.. తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని, దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువ ప్రభావితం కానుందని తాజా నివేదికలు వెల్లడించడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికన్ల ఉద్యోగాలను ప్రవాసులు, వలసవాదులు కొల్లగొడుతున్నారంటూ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అమెరికన్ల ఉద్యోగాలకు ప్రవాసుల నుంచి కాకుండా మరో రకంగా భారీ ముప్పు పొంచివుంది.

ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్ది పనివారు.. తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని, దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువ ప్రభావితం కానుందని తాజా నివేదికలు వెల్లడించడం గమనార్హం. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే 15ఏళ్ల(2030వరకు)లో దాదాపు 38శాతం మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని పీడబ్ల్సూసీ తాజా నివేదిక హెచ్చరించింది.

Robots expected to take 38 percent of U.S. jobs by 2030s

అదేవిధంగా యూకేలోనూ 30శాతం ఉద్యోగాలు పోనున్నాయని తెలిపింది. ఇదే రకమైన ప్రమాదం జపనీయులకూ పొంచివుందని స్పష్టం చేసింది. అమెరికా, యూకే లేబర్ మార్కెట్లో సర్వీసు ఉద్యోగాలు ఎక్కువగా ఆధిపత్యం కొనసాగిస్తుంటాయని, అదే స్థాయిలో కీలకరంగాలైన ఫైనాన్స్, ట్రాన్స్ పోర్టేషన్, ఎడ్యుకేషన్, మానుఫాక్చరింగ్, ఫుడ్ సర్వీసు రంగాల్లో ఉద్యోగులు ఎక్కువగా పని చేస్తుంటారని నివేదిక పేర్కొంది.

ఫైనాన్సియల్ సర్వీసెస్ ఉద్యోగాలు తీసుకుంటే, రోబోట్స్‌తో రీప్లేస్ అయి, 61శాతం ఉద్యోగాలు హరించుకుపోతాయని నివేదిక వెల్లడించింది. అయితే, యూకేలో మాత్రం ఫైనాన్షియల్ జాబ్స్ 32శాతం మాత్రమే కోల్పోనున్నాయని పేర్కొంది. కాగా, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సోషల్ వర్క్స్ లో పనిచేసే ఉద్యోగులు ఈ రోబోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తక్కువగా ప్రభావితమవుతారని పీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేసింది. రోబోల వల్ల సామాజిక అంతరాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

English summary
Thirty-eight percent of jobs in the U.S. are at high risk of being replaced by robots and artificial intelligence over the next 15 years, according to a new report by PwC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X