• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో మరో నల్లజాతీయుడి మృతి: నగ్నంగా.. నడిరోడ్డుపై: ఊపిరి ఆడకుండా చేసిన పోలీసులు

|

వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యాన్ని అట్టుడికిస్తోన్న జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి రెండు నెలల ముందే.. మరో నల్లజాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించాడు. జార్జ్ ఫ్లాయిడ్ తరహాలోనే ఆయనను కూడా ఊపిరి ఆడకుండా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, వీడియో క్లిప్పింగ్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో మరోసారి నల్లజాతీయుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. అతని మరణానికి కారణమైన ఏడుమంది పోలీసులను రోచెస్టర్ మేయర్ సస్పెండ్ చేశారు.

జార్జ్ ఫ్లాయిడ్ కంటే ముందే..

జార్జ్ ఫ్లాయిడ్ కంటే ముందే..

న్యూయార్క్‌ స్టేట్‌లోని రోచెస్టర్‌లో మార్చి 30వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం అమెరికాలో పెను సంచలనంగా మారింది. అధ్యక్ష ఎన్నికల కన్వెన్షన్లు జోరుగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియో వెలుగులోకి రావడం రిపబ్లికన్లకు ఇబ్బందికర పరిస్థితులను కల్పించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మిన్నెసొటాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం, విస్కాన్సిన్‌లో జాకబ్ బ్లేక్‌పై పోలీసులు కాల్పులు జరపడం ఘటనలతో ఇప్పటికే నల్లజాతీయులు భగ్గుమంటున్నారు.

నగ్నంగా.. నడిరోడ్డుపై

రోచెస్టర్‌లో చోటు చేసుకున్న ఘటనలో మృతుడి పేరు డేనియల్ ప్రుడె. ఆయన స్వస్థలం చికాగో. మార్చిలో తన కుటుంబ సభ్యులతో కలిసి రోచెస్టర్‌కు వెళ్లారు. మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల రోచెస్టర్‌లో అతను తప్పిపోయాడు. తన సోదరుడు తప్పిపోయాడంటూ కుటుంబ సభ్యులు రోచెస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రయత్నంలో ఉన్న పోలీసులు మార్చి 23వ తేదీన తెల్లవారు జామున 3:15 నిమిషాలకు ఆయనను పట్టుకున్నారు. బట్టలు లేకుండా తిరుగుతోన్న డేనియల్ చేతులను వెనక్కి విరిచి కట్టారు. తలను హుడ్‌తో కప్పేశారు. కొన్ని నిమిషాల పాటు ఆయనను అలాగే నడిరోడ్డు మీద కూర్చోబెట్టారు.

హుడ్‌తో తలను కప్పేయడంతో..

హుడ్‌తో తలను కప్పేయడంతో..

హుడ్‌తో తలను కప్పేయడం, ఎటూ కదలడానికి వీలు లేకపోవడంతో డేనియల్ ఊపిరి ఆడక స్పృహ తప్పడాడు. కొద్దిసేపటి తరువాత ఆయనలో చలనం లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 30వ తేదీన ఆయన మరణించారు. ఊపిరి ఆడకుండా చేయడం (ఆస్పిక్షియేషన్) వల్లే డేనియల్ మరణించిన డాక్టర్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది. బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. ఈ వీడియో క్లిప్‌ను హ్యూమన్ రైట్స్ వాచర్ ఒకరు.. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

  Permanent Work From Home Damages Mental Health Of Employees, Says Satya Nadella
  రోచెస్టర్‌లో ఉద్రిక్తత..

  రోచెస్టర్‌లో ఉద్రిక్తత..

  ఈ వీడియో క్లిప్ వెలుగులోకి రావడం, డేనియల్ ప్రుడె సోదరుడి ఫిర్యాదుకు రోచెస్టర్ మేయర్ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన ఏడుమంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రోచెస్టర్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. పలుచోట్ల బ్లాక్ లైవ్ మేటర్ ఆందోళనకారులు ప్రదర్శనలను నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. డేనియల్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. రోచెస్టర్ సిటీ పోలీసుల ప్రధాన కార్యాలయం ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

  English summary
  A Black man died in March after police in Rochester, New York, put a hood over his head and pressed his face into the ground for more than three minutes while he was naked and handcuffed, according to body camera footage and documents released by the victim's family on Wednesday. Daniel Prude, 41, died seven days after the incident, according to the medical examiner's report, which attributed his death in part to asphyxiation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X