వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌పై మరోసారి రాకెట్ దాడి, కిర్కుక్ ప్రావిన్స్‌లో అటాక్, ధృవీకరించిన అమెరికా, ఇరాక్

|
Google Oneindia TeluguNews

ఇరాక్ భూభాగంలో మరోసారి రాకెట్ దాడి జరిగింది. గురువారం రాత్రి కిర్కుక్ ప్రావిన్స్‌లో గల శిబిరంపై దాడి చేశారు. రాకెట్ దాడిని అమెరికా, ఇరాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నాయి. దాడి చేసింది ఎవరనే అంశాన్ని మాత్రం ధృవీకరించలేదు.

 Rocket attack hits north Iraq base hosting US troops

డిసెంబర్ 27 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి రాకెట్లతో దాడులు చేయడం. కే1 స్థావరం చేసిన దాడిలో అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్ చనిపోయిన సంగతి తెలిసిందే. 30 రాకెట్లతో బీభత్సం సృష్టించారు. దాడి చేసింది ఇరాన్‌కు సమీపంలో ఉన్న కటేట్ హిజ్బుల్లా అని అమెరికా అప్పట్లో ఆరోపించింది. అయితే తర్వాత అమెరికా ప్రతీకార దాడులు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

తమ స్ధావరాలపై దాడి చేసిన కటేట్ హిజ్బుల్లాపై అమెరికా సేనలు దాడులు నిర్వహించాయి. అంతేకాదు ఇరాన్‌కు చెందిన ఖాసీం సొలైమానిని హతమార్చింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరిన సంగతి తెలిసిందే.

English summary
A rocket attack on Thursday night slammed into an Iraqi base in the remote province of Kirkuk where American troops are stationed, Iraqi and US security sources told AFP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X