వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్‌వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇన్నాళ్లూ.. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ (పీఎస్ఎల్‌వీ) వంటి రాకెట్ లాంఛర్లను ఉపయోగించడాన్ని చూశాం. దీనికి భిన్నంగా.. ఓ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడమే విషయం ఊహకు కూడా అందకపోవచ్చు. అలాంటి ఊహాజనిత ప్రయోగానికి అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు పౌర విమానయాన సంస్థ వాస్తవ రూపాన్ని ఇచ్చింది. బోయింగ్ 747 విమానం ద్వారా ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఆ సంస్థ పేరు వర్జిన్ ఆర్బిట్. అంతరిక్ష ప్రయోగాలను సాగించడానికి ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ అది. కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా పని చేస్తోన్న ఆ కంపెనీ.. ఈ ఘనతను అందుకుంది. బోయింగ్ 747 విమానం ద్వారా తొమ్మిది రాకెట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాస్మిక్ గర్ల్‌గా ముద్దగా పిలుచుకునే ఈ విమానం ఎడమ రెక్కకు ఓ మిస్సైల్ సైజ్‌లో ఉన్న రాకెట్‌ను అమర్చారు. వాటికి ఈ తొమ్మిది నానో ఉపగ్రహాలను జత చేశారు. ఈ రాకెట్ లాంచర్‌ను మోసుకెళ్లిన కాస్మిక్ గర్ల్ బోయింగ్ 747 విమానం.. పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణించింది.

 Rocket startup Virgin Orbit launches rocket off a 747 aircraft, puts 9 satellites in space

ఆ విమానం నిర్దేశిత లక్ష్యానికి చేరుకున్న తరువాత ఆ మిస్సైల్‌ను ఎజెక్ట్ చేసింది. గంటకు 17 వేల మైళ్ల వేగంతో ప్రయాణించిన ఆ మిస్సైల్.. నిర్ణీత సమయానికి, నిర్దేశిత భూకక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వర్జిన్ ఆర్బిట్ చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు లాంచర్ వన్ అని పేరు పెట్టారు. నాసా రూపొందించిన ఎడ్యుకేషన్ నానో శాటిలైట్లను విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వర్జిన్ ఆర్బిట్ తెలిపింది.

విద్యార్థులను ప్రోత్సహించడానికి నాసా చేపట్టిన కాంపిటీషన్‌లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు ఈ తొమ్మిది ఉపగ్రహాలను రూపొందించారు. వారే సొంతంగా వాటిని డిజైన్ చేశారు. విమానం గమనాన్ని వారు యూనివర్షిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్శిటీ ఆఫ్ లూసియానా నుంచి పర్యవేక్షించారు. అంతరిక్ష ప్రయోగాల కోసం ఆవిర్భవించిన మూడో ప్రైవేటు కంపెనీగా వర్జిన్ ఆర్బిట్ గుర్తింపు తెచ్చుకుంది. ఇదివరకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో పాటు రాకెట్ ల్యాబ్ అనే మరో కంపెనీ ఈ రంగంలో ఏర్పాటు అయ్యాయి.

తాజాగా వర్జిన్ కంపెనీ అంతరిక్ష ప్రయోగాల సెక్టార్‌లో ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం భవిష్యత్తులో తాము అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడానికి వీలు కల్పించిందని వర్జిన్ ఆర్బిట్ కంపెనీ పేర్కొంది. భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి గల అవకాశాలను తాము పరిశీలనలోకి తీసుకుంటామని, దానికి అనుగుణంగా బోయింగ్ 747 విమానం సామర్థ్యాన్ని పెంచుకుంటామని తెలిపింది.

English summary
A 70-foot rocket, riding beneath the wing of a retrofitted Boeing 747 aircraft, detached from the plane and fired itself into Earth's orbit on Sunday marking the first successful launch for the California-based rocket startup Virgin Orbit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X