వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఆధీనంలోని ఇరాక్ ఎయిర్‌బేస్‌పై రాకెట్ దాడులు, నలుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఇరాన్ మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా మట్టుబెట్టాక మధ్య ప్రాచ్యలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బుధవారం తమ విమానాన్ని ఇరాన్ మిలిటరీ.. శత్రువుల విమానం అనుకొని కూల్చివేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఇరాక్ ఎయిర్‌బేస్‌పై రాకెట్ ప్రయోగం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

బాగ్దాద్‌కు ఉత్తరాన ఉన్న ఆల్ బసద్ ఎయిర్‌బేస్‌ అమెరికా ఆధీనంలో ఉంది. దీని లక్ష్యంగా ఆదివారం ఎనిమిది రాకెట్లతో దాడి చేశారు. నలుగురు గాయపడ్డారని.. అందులో ఇద్దరు ఇరాకీ అధికారులు అని, ఇద్దరు ఎయిర్‌మెన్లు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Rockets hit Iraq airbase hosting US troops, 4 injured

ఆల్ బసద్ ఎయిర్‌బేస్‌లో ఎఫ్-16 విమానాలకు స్థావరం.. అంతేకాదు ఇక్కడినుంచి అమెరికా తన ఆపరేషన్లను నిర్వహిస్తోంది. అయితే గత రెండువారాలుగా ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌బేస్ దాడులు చేస్తారనే హెచ్చరికల నేపథ్యంలో 90 శాతం అమెరికాకు చెందిన వాయుసేన నిర్వహణకు సంబంధించి సలహాదారులు, ఉద్యోగులను పంపించివేశారు. అంతేకాదు 15 మంది అమెరికా సైనికులు, విమానం కూడా ఇక్కడ లేదని పేర్కొన్నది.

Recommended Video

#IranvsUSA : బాగ్దాద్‌పై రెండు రాకెట్లను ప్రయోగించిన ఇరాన్..!! || Oneindia Telugu

అంతేకాదు అమెరికా దళాలకు ఆతిథ్యమిచ్చే సైనిక స్థావరాలు ఇటీవల రాకెట్, మోర్టార్ దాడులకు కూడా గురయ్యాయి. ఇరాకీ దళాలను టార్గెట్‌గా దాడి చేశాయి. గత నెలలో అమెరికా కాంట్రాక్టర్‌ను కూడా మట్టుబెట్టాయి.

English summary
A volley of rockets slammed into an Iraqi airbase north of Baghdad where US forces have been based, wounding four local troops, the Iraqi military said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X