• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: వైరస్ సృష్టికర్త ఆయనే.. 5జీ నెట్‌వర్క్‌తో వేగంగా వ్యాప్తి.. అసలు కథ ఇదేనంటూ..

|

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 21లక్షల మందికి సోకిన కరోనా వైరస్.. మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం నాటికి 1.35లక్షల మందిని బలితీసుకుంది. మరో 51వేల మంది క్రిటికల్ కండిషన్ లో కొట్టుమిట్టాడుతున్నారు. కొవిడ్-19 వ్యాధికి మందు ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేదు. సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గమని చెబుతున్నా, అన్నిచోట్లా జనం లాక్ డౌన్ ఆదేశాలను ధిక్కరిస్తూనే ఉన్నారు. కరోనా పుట్టినప్పటి నుంచీ దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మామూలు జనం మాట్లాడితే అవగాహనా రాహిత్యమని కొట్టిపారేయోచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నెత్తీనోరు కొట్టుకున్నా.. దేశాధినేతలు, పవర్ ఫుల్ వ్యక్తులే 'కుట్ర' కోణాల్ని చర్చకు పెడితే ఏమనుకోవాలి?

బ్లాస్టింగ్ కామెంట్స్..

బ్లాస్టింగ్ కామెంట్స్..

ఊరికే వాగరు మహానుభావులు అన్నట్లు, ఏ నోటితోనైతే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరోనాను ‘చైనీస్ వైరస్'అన్నాడో, సరిగ్గా దానికి తగ్గ రుజువులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైరస్ ప్రమాదాన్ని చైనా ముందుగానే గుర్తించినా, ఆ విషయాన్ని ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటించినందు వల్లే ప్రపంచం ముప్పు ముంగిట నిలబడాల్సి వచ్చిందని ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ ‘అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)' ఆధారాలతో సహా నిరూపించింది. ఇప్పుడు ట్రంప్ ఆంతరంగికుడు, అమెరికాలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ కన్సల్టంట్ రోజర్ స్టోన్ మరో బాంబు పేల్చారు. మనందరికీ సుపరిచితుడైన వ్యక్తిపై బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు.

కుట్రదారు ఆయనే..

కుట్రదారు ఆయనే..

‘‘మీరు నమ్మినా, నమ్మకపోయినా, నేను చెప్పేదానిపై కచ్చితంగా చర్చించండి. నా దాకా వస్తే, నా శవానికి కూడా వ్యాక్సిన్ వద్దంటాను. ‘కంపల్సరీ వ్యాక్సినేషన్' ఎంత పెద్ద కుట్రో అందరికీ తెలుసు. ఈ భూమ్మీదున్న మనుషులందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలని కొందరు గ్లోబలిస్టులు ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా ఉన్నాడు. నిజానికి కరోనా వైరస్ ను సృష్టించింది ఆయనే. వైరస్ పేరుతో అందరికీ వ్యాక్సినేషన్ చేసి, దానికి గుర్తుగా ఒంట్లో మైక్రోచిప్ పెడతారు. కాబట్టి వాళ్ల కుట్రల్ని అడ్డుకుందాం''అని రోజస్ స్టోన్ ఆరోపించారు. ట్రంప్ ఆత్మల్లో ఒకరైన స్టోన్స్.. అనుచిత ప్రవర్తన నేరం కింద జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. అసలీకథ ఎలా మొదలైందంటే..

అసలేంటీ గొడవ?

అసలేంటీ గొడవ?

తప్పనిసరి టీకాలు(మ్యాండేటరీ వ్యాక్సినేషన్)పై అమెరికాతోపాటు అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయాదేశాల్లోని సంప్రదాయవాదులు(కంజర్వేటివ్స్) అందరూ వ్యాక్సినేషన్ ను వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. అవసరమైతే జైలుకైనా వెళతాం గానీ, మా పిల్లలకు వ్యాక్సిన్లు వేయించబోమనే తల్లిదండ్రుల ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీనికి భిన్నంగా సైంటిస్టులు, బిల్ గేట్స్ లాంటి ఫిలాంత్రఫిస్టులు.. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, కొత్త రకం వైరస్ లను సైతం తట్టుకుని సేఫ్ గా ఉండేలా బలమైన వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ల రీసెర్చ్ కోసం బిల్ గేట్స్ ఏకంగా 45 బిలియన్ డాలర్లు విరాళం కూడా ఇచ్చారు. అదీగాక, WHOకు నిధులు నిలిపేసిన విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ తీరును గేట్స్ తీవ్రంగా తప్పుపట్టారు. వ్యాక్సిన్ వ్యతిరేకి, ట్రంప్ అనుకూలుడైన రోజర్ స్టోన్స్ ఇదే అదనుగా బిల్ గేట్స్ పై కుట్ర ఆరోపణలు చేశారు. మరోవైపు..

5జీ నెట్‌వర్క్..

5జీ నెట్‌వర్క్..

కరోనా వైరస్ వ్యాప్తికి 5జీ నెట్ వర్క్ కూడా ఒక కారణమేనని చాలా మంది ప్రజలు నమ్ముతున్నట్లు ప్రఖ్యాత ‘సన్' పత్రిక తెలిపింది. 5జీ నెట్ వర్క్ సిగ్నల్స్ లోని రేడియేషన్ వల్ల మనుషుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని, అప్పుడు వైరస్ ఈజీగా దాడి చేయగలుగుతుందనే థియరీని విశ్వసిస్తున్నట్లు పలువురు చెప్పారు. చైనాలో 5జీ నెట్ వర్క్ సేవలు మొదలైన కొద్ది రోజులకే కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని, తమ నమ్మకాలకు అదొక తిరుగులేని ఆధారమని ప్రజలు అనుకుంటున్నట్లు ‘సన్' తన కథనంలో రాసింది. నిజానికి..

ట్రంప్ అనుచరుడి లెక్క తప్పు..

ట్రంప్ అనుచరుడి లెక్క తప్పు..

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పై ట్రంప్ మనిషి రోజర్ స్టోన్స్ చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతుండగానే, కరోనాకు సంబంధించి కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించినా, ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపుతోంది. క్షయ వ్యాధికి విరుగుడుగా వాడే ‘బీసీజీ వ్యాక్సిన్'ను తప్పనిసరి చేసిన దేశాల్లో కొవిడ్-19 తీవ్రత తక్కువగా ఉందని, బీసీజీ వ్యాక్సినేషన్‌ను సార్వత్రికంగా అమలు చేయని అమెరికా, ఇటలీ, నెదర్లాండ్‌ లాంటి దేశాల్లో తీవ్రంగా ఉందని సాక్ష్యాత్తూ అమెరికా అధ్యయన సంస్థలే తేల్చాయి. అమెరికా కంటే ముందే విలయాన్ని చవిచూసిన ఇరాన్ లో మరణాలు ఆగిపోడానికి కూడా ఇదే కారణమని, ఇరాన్ లో 1984 నుంచి వ్యాక్సినేషన్‌ పక్కాగా జరిగిందని, వ్యాక్సినేషన్ అమల్లో ఉన్న దేశాలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది.

  India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown
  English summary
  Trump's buddy Roger Stone said Monday Bill Gates may have created the coronavirus to microchip people. Speaking about the deadly virus Stone said, Whether Bill Gates played some role in the creation and spread of this virus is open for vigorous debate."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X