వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీగలాగితే డొంక కదులుతోంది: ట్రంప్ సన్నిహితుడు అరెస్టు... అమెరికా అధ్యక్షుడు ఇరకాటంలో పడుతున్నారా..?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు రోజర్ స్టోన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ అభ్యర్థుల ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానిపై విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ రష్యా పాత్ర ఉందంటూ వెల్లడించింది. ఇందులో భాగంగా రష్యా వారికి రోజర్ స్టోన్ సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫ్లోరిడాలో స్టోన్‌ను అరెస్టు చేశారు అధికారులు. పలు కేసులు ఆయనపై నమోదు చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేయి కలిపాడా..?

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డెమెక్రాట్ అభ్యర్థుల ఈమెయిల్స్ హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ తెలుపుతూ వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టింది వికీలీక్స్. తన సన్నిహితుడు అరెస్టు అయ్యాడన్న సంగతి తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి రష్యా విచారణ సంస్థపై మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత హేయమైన చర్యగా ట్రంప్ అభివర్ణించారు. ఇదిలా ఉంటే రోజర్ స్టోన్ రష్యా విచారణ సంస్థను ప్రభావితం చేయాలని చూసినట్లు కేసు నమోదు అయ్యింది. అంతేకాదు వికీలీక్స్, రోజర్ స్టోన్ మధ్య ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్ కమిటీకి అసత్యాలు చెప్పారు. వికీలీక్స్ రోజర్ స్టోన్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి రికార్డులు సేకరించిన ఇంటెలిజెన్స్ వర్గాల వారిని తప్పుదోవ పట్టించేందుకు రోజర్ స్టోన్ ప్రయత్నించారనే అభియోగం మోపబడింది. అంతేకాదు సాక్షాలను ట్యాంపరింగ్ చేసేందుకు రోజర్ ప్రయత్నించారని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

బెయిల్ పై విడుదలైన రోజర్ స్టోన్

బెయిల్ పై విడుదలైన రోజర్ స్టోన్

అరెస్టు అయిన రోజర్ తిరిగి షరతులతో విడుదలయ్యారు.2లక్షల50వేల డాలర్లు పూచీకత్తుగా పెట్టి బయటకు వచ్చారు. అంతేకాదు ఫ్లోరిడా, వాషింగ్టన్, న్యూయార్క్‌లలో అదికూడా కోర్టు విచారణకు మాత్రమే రావాలనే షరతు న్యాయస్థానం విధించింది. అంటే తన మరో ప్రాంతానికి కోర్టు అనుమతి లేనిదే వెళ్లరాదని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. తను నిరపరాధినని తను ఏతప్పు చేయలేదని స్టోన్ వెల్లడించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని చెప్పేదానికి ఎలాంటి రుజువులు లేవని వెల్లడించారు స్టోన్. ట్రంప్ ఎన్నికల్లో గెలిచేందుకు తాను ఎలాంటి అడ్డదారి తొక్కలేదని స్పష్టం చేశాడు.

నిరపరాధిగా బయటకు వస్తాను

నిరపరాధిగా బయటకు వస్తాను

కోర్టు బయట స్టోన్‌కు వ్యతిరేకంగా డెమొక్రాట్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టోన్‌ను జైల్లో పెట్టాల్సిందిగా నినాదాలు చేశారు. వచ్చేవారం వాషింగ్టన్ కోర్టులో తాను నిరపరాధిగా బయటకు వస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షలో భాగంగా జరుగుతున్నదే అని రోజర్ స్టోన్ చెప్పారు.

English summary
Political strategist Roger Stone, a long-time ally of President Trump, has been arrested in Florida, charged with seven counts in the Mueller probe.Mr Stone, 66, appeared in court in the city of Fort Lauderdale.The indictment includes one count of obstruction of an official proceeding, five counts of false statements, and one count of witness-tampering.The charges are linked to an alleged Russian-led hack into the emails of Democratic Party officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X