వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహింగ్యాల ఊచకోత: రేప్, సామూహిక ఖననం: షాకింగ్ ట్విస్ట్: క్లియరెన్స్ ఆపరేషన్‌గా

|
Google Oneindia TeluguNews

యాంగూన్: మయన్మార్‌లో చోటు చేసుకున్న రోహింగ్యా ముస్లింల ఊచకోతపై దిగ్భ్రాంతికర విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై నెదర్లాండ్స్‌లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్వహిస్తోన్న విచారణ సందర్భంగా షాకింగ్ ట్విస్టులు బయటపడుతున్నాయి. రోహింగ్యాల ఊచకోతలో పాల్గొన్న ఇద్దరు మయన్మార్ సైనికులు తమ నేరాన్ని అంగీకరించారు. రోహింగ్యాలపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వారు నివసిస్తోన్న గ్రామాలను నిర్మూలించామని, హత్యానంతరం సామూహిక ఖననం చేసినట్లూ ఒప్పుకొన్నారు.

2017 నాటి ఘటన..

2017 నాటి ఘటన..

మూడేళ్ల కిందట ఈ ఘటన చోటు చేసుకుంది. 2017 ఆగస్టు 26వ తేదీన తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని ముంగ్డౌ టౌన్‌షిప్ సమీపంలో గల జిన్‌పెయింగ్ న్యార్ విలేజ్‌లో నివసిస్తోన్న 30 మంది రోహింగ్యా ముస్లింలను ఆ దేశ సైనికులు హతమార్చారు. తెల్లవారు జామునే ఆ గ్రామంపై దాడి చేశారు. రోహింగ్యా నివాసాలను తగులబెట్టారు. బుల్‌డోజర్లతో ధ్వసం చేశారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. 30 మందిని దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. ఇదే టౌన్‌షిప్ సమీపంలో గల గ్రామాల్లో మొత్తం 80 మందిని హత్య చేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ..

అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ..

ఈ ఘటనపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. కొందరు ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నివేదికలను రూపొందించింది. రీమేకింగ్ రఖినె స్టేట్ అనే పేరుతో ఓ ప్రత్యేకంగా ఓ నివేదిను తయారు చేసింది. ఈ ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటాన్ని చేపట్టింది. ఈ ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆకృత్యాలకు పాల్పడిన వారిలో ఇద్దరు మయన్మార్ సైనికులు విచారణకు హాజరయ్యారు. తమ నేరాన్ని అంగీకరించారు. తమపై అధికారుల ఆదేశాల మేరకు తాము ఆ చర్యలకు దిగినట్లు వెల్లడించారు. దీన్ని క్లియరెన్స్ ఆపరేషన్‌గా చేపట్టినట్లు తెలిపారు.

కనిపించిన వారిని కనిపించినట్టే..

కనిపించిన వారిని కనిపించినట్టే..

ఆ ఇద్దరు సైనికులు మయన్మార్ 565 లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన వారు. జిన్‌పెయింగ్ న్యార్ గ్రామంలో కనిపించిన రోహింగ్యాలను కనిపించినట్టే మట్టుబెట్టాలంటూ తమకు ఆదేశాలు అందాయని వారిద్దరూ వెల్లడించారు. ఆ ప్రాంతం నుంచి వారిని తుడిచి వేయాలంటూ కల్నల్ స్థాయి అధికారి తమను ఆదేశించినట్లు తెలిపారు. మహిళలను చంపడానికి ముందు వారిపై అత్యాచారం చేయాలని, చిన్నపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా కాల్చి చంపాలని ఆదేశించారని తెలిపారు. హత్యాకాండ అనంతరం స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ వద్ద 30 మృతదేహాలను తాము సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

Recommended Video

Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?
మరో గ్రామంపైనా

మరో గ్రామంపైనా

ముంగ్డౌ టౌన్‌షిప్ పరిసరాల్లోని మరో గ్రామంలో నివసించే రోహింగ్యాలపైనా మయన్మార్ సైనికులు దాడులు కొనసాగాయి. 353 లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన సైనికులు ఈ దాడుల్లో పాల్గొన్నారని, రోహింగ్యా ముస్లింలు నివసించే 20 గ్రామాలను తుడిచి పెట్టేయాలంటూ ఆదేశాలు అందగా.. దానికి అనుగుణంగా వారు సైనిక చర్యను కొనసాగించారని తెలిపారు. ఈ ఘటనల తరువాత సుమారు 7,30,000 మంది రోహింగ్యాలు మయన్మార్‌ను విడిచి వెళ్లిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొంది. వారిలో చాలామంది పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్నట్లు అంచనా వేస్తున్నామని వెల్లడించింది.

English summary
Rohingya's were killed brutally by the Myanmar soldiers on the orders of higher officials confessed two soldiers in a video testimony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X