వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనిమనిషి కోసం ప్రకటన.. జీతం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం.. ఊహకే అందని నంబర్.

|
Google Oneindia TeluguNews

హెడింగ్ చదివి చాలామంది ఇది నిజమేనా అని సందేహించి ఉంటారు. కానీ ఇది వంద శాతం నిజం. బ్రిటన్‌ రాజకుటుంబం తమ రాజప్రసాదాల్లో ఒకటైన విండ్‌సర్ క్యాస్టిల్‌‌లో పనిచేసేందుకు హౌజ్‌ కీపింగ్ స్టాఫ్ కావాల్సిందిగా ఇటీవల ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన ఈ ప్రకటనలో... హౌజ్ కీపింగ్ ఉద్యోగానికి ప్రారంభ వేతనం రూ.18.5లక్షలుగా పేర్కొంది. ఒక పని మనిషి కోసం ఇంత భారీ వేతనాన్ని ఆఫర్ చేయడం చాలామందిని నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం: ఎదురయ్యే సవాళ్లేంటీ? ఎలా అధిగమించాలి? బ్రిటన్ ఘనతమనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం: ఎదురయ్యే సవాళ్లేంటీ? ఎలా అధిగమించాలి? బ్రిటన్ ఘనత

పనిచేసేది విండ్‌సర్ క్యాస్టిల్‌లోనే అయినా బకింగ్‌హామ్ ప్యాలెస్‌తో పాటు ఇతర రాజప్రసాదాల్లోనూ వీరికి అనుమతి ఉంటుంది. ఏడాదికి 33 సెలవులు ఇస్తారు. ఇతర రాయల్ ఫ్యామిలీ ఉద్యోగుల లాగే వీరికి కూడా విలాసవంతమైన సదుపాయాలు ఉంటాయి. ప్రయాణ ఖర్చులను కూడా రాజకుటుంబమే భరిస్తుంది.

Rs 18.5 Lakh Salary for Housekeeping Job in uk royal palace

అంతా బాగానే ఉంది కానీ బ్రిటన్ రాజప్రసాదంలో పని మనిషి ఉద్యోగమంటే అంత ఆషామాషీ ఏమీ కాదు. ఇందుకోసం 13 నెలల ప్రత్యేక శిక్ష కూడా ఉంటుంది. అంతేకాదు,సదరు వ్యక్తి ఇంగ్లీష్,మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై కాకపోతే శిక్షణ కాలంలో ఆ సబ్జెక్టులను నేర్చుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సిల్వర్ స్వాన్ దీనిపై మాట్లాడుతూ... బ్రిటన్ రాజప్రసాదానికి తగ్గ పనిమనిషిని వెతకడం అంటే గడ్డి వాములో గుండుపిన్ను కోసం వెతకడం లాంటిదే అన్నారు. బ్రిటన్ రాజప్రసాదంలో ప్రతీ పనిమనిషి నిర్వహించే పని వేరుగా ఉంటుందన్నారు. క్వాలిఫికేషన్స్ కంటే శిక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు. తాజా ప్రకటనలో పేర్కొన్న హౌస్ కీపింగ్ పోస్టు ఇంటీరియర్,ఇతరత్రా వస్తువుల క్లీనింగ్‌,కేరింగ్‌కి సంబంధించిందిగా పేర్కొన్నారు.

English summary
The job has been posted on the official website of The Royal Household and is a housekeeping job. It is a Level 2 Apprenticeship. The candidate selected for the job will get to live at the palace. They will be staying at Windsor Castle, but may also have to move around and work at the Buckingham Palace as well. The candidate will be trained both on and off the job to “upkeep, clean and care for interiors and items, ensuring they’re presented to their very best
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X