వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం:WHOతో బంధం కట్.. ట్రంప్ సంచలనం.. ఇకపై చైనాతో అమెరికా నేరుగా..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విషయంలో మొదటి నుంచి ఒక దేశాధినేతగా కాకుండా, ఫక్తు వ్యాపారవేత్తలా వ్యవహరిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. గురువారం అర్ధరాత్రి నాటికి అక్కడ 85,612 మందికి వైరస్ సోకింది. 1,301 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయానికి చైనాతోపాటు దానికి వత్తాసుపలుకుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)లే కారణమని ట్రంప్ ఆరోపించారు.

 వైరస్ చైనా కుట్ర..

వైరస్ చైనా కుట్ర..

కరోనా వైరస్ విషయంలో చైనా మొదటి నుంచీ అందర్నీ మోసం చేస్తూ వచ్చిందని, ప్రపంచ దేశాల్ని ప్రమాదంలో పడేసేలా చైనా పాలకులైన కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) కుట్రలు చేసిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో జీ7 దేశాల సదస్సులో అక్కసు వెళ్లగక్కిన తర్వాతి రోజే ప్రెసిడెంట ట్రంప్ సైతం డ్రాగన్ దేశంపై నిప్పులు చెరిగారు. చైనాకు కొమ్ముకాస్తున్న WHO తో అమెరికా సంబంధాలు కట్ చేసుకోడానికి ఏమాత్రం వెనుకాడబోదని ఆయన సంచలన ప్రకటన చేశారు. గతంలో ఆర్థిక భారం పేరుతో ట్రంప్ ‘నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో)' నుంచి కూడా వైదొలగిన సంగతి తెలిసిందే.

గుడ్‌బైపై త్వరలో నిర్ణయం..

గుడ్‌బైపై త్వరలో నిర్ణయం..

అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘కోరాన వైరస్ విషయంలో WHO అంత పచ్చిగా, బాహాటంగా చైనాను సమర్థిస్తుండటంపై ప్రజలు చాలా అసంతృప్తికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నది. కాబట్టే దాంతో సంబంధాలు తెంచుకునే విషయమై మేము సీరియస్ గా ఆలోచిస్తున్నాం. కల్లోలం కాస్త కుదుటపడ్డ తర్వాత దానిపై వర్కౌట్ చేస్తాం''అని చెప్పుకొచ్చారు. కానీ అంతలోనే..

చైనాతో నేరుగా..

చైనాతో నేరుగా..

కరోనా కల్లోలానికి చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలే కారణమన్న ట్రంప్.. గంటల వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపర్చారు. అమెరికాలో కరోనా కట్టడికి నేరుగా చైనా నుంచే సాయం తీసుకుంటామని మరో సంచలన ప్రకటన చేశారు. కరోనాను చైనా వైరస్ అంటూ పదే పదే ఎగతాళి చేసిన ట్రంప్.. ఇప్పుడా మహమ్మారి తన దేశంలోనే కల్లోలం సృష్టిస్తుండటంతో చివరికి చైనాతో చర్చలకు దిగిరాక తప్పలేదు. శుక్రవారం ఉదయం చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ కు ఫోన్ చేసిన ట్రంప్.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయం కోరడం గమనార్హం.

ఇకపై ఇద్దరం కలిసి..

ఇకపై ఇద్దరం కలిసి..

‘‘ఇప్పుడే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో మాట్లాడాను. కరోనా విషయంలో చాలా లోతుగా చర్చలు జరిపాం. వైరస్ ను సమగ్రంగా అర్థం చేసుకోవడంలోగానీ, దాన్ని నిరోధించే విషయంలోగానీ చైనాకు చక్కటి అనుభవముంది. దాన్ని అమెరికా కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నది. ఇకపై కరోనా కట్టడిలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి''అని ట్రంప్ తెలిపారు. చైనాపై అనవసరంగా బురద చల్లొద్దని, ట్రేడ్, ఇతర సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తామని జిన్ పింగ్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

నిజంగా చేస్తారా?

నిజంగా చేస్తారా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి వైదొలగే విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామన్న ట్రంప్.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, మాటలు మార్చడం ఆయను కొత్తేమీ కాదని అమెరికన్ మీడియా పేర్కొంది. వైరస్ జీవాయుధం కాదని, సహజంగా పుట్టిందేనని సైంటిస్టులు నిర్ధారించిన తర్వాతగానీ ట్రంప్ తన వైఖరిని మార్చుకోలేదని, వైరస్ వ్యాప్తి నిరోధానికి చైనా సహకారం తీసుకోవడం తప్పేమీకాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

English summary
Trump says the US and China are ‘working closely together’ in fight against the coronavirus. he accused WHO is Very Much Sided With China. US now has more coronavirus cases than any other country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X