వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ రూపాయి 'ఢమాల్':భారీ పతనం.. తొమ్మిదేళ్లలో అత్యంత కనిష్టం..

ఇంట్రా బ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపునకు సెంట్రల్ బ్యాంకు ఈ డీవాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ తెలిపారు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో రూపాయి విలువ అంతకంతకూ పడిపోతూనే ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో గత తొమ్మిదేళ్లలో రూపాయి విలువ అత్యంత భారీగా పతనమైంది. డాలర్ తో ప్రస్తుతం పాక్ రూపాయి మారకం విలువ 3.1శాతం మేర పడిపోయి 108.1గా నమోదైంది.

రూపాయి విలువ పతనం అక్కడి కేంద్ర బ్యాంకు వ్యూహాత్మక ఎత్తుగడగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందుగా దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తనుందన్న సంకేతాల నేపథ్యంలో.. రూపాయి విలువను కేంద్ర బ్యాంకే డీవాల్యుయేట్ చేయడానికి అనుమతినిచ్చింది. దీంతో 2013డిసెంబర్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ చేరుకుంది.

Rupee devaluation in Pakistan? Currency drops most in 9 years

ఇంట్రా బ్యాంకు సిస్టమ్ ద్వారా చేసే దిగుమతుల చెల్లింపునకు సెంట్రల్ బ్యాంకు ఈ డీవాల్యుయేషన్ చేపడుతుందని బీఎంఏ క్యాపిటల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ ఫవద్ ఖాన్ తెలిపారు. తద్వారా పేరుకుపోతున్న లోటును తగ్గించవచ్చునని కేంద్రబ్యాంకు భావిస్తోంది. దీనికి తోడు ఎగమతులు కూడా ఊపందుకుంటాయని చూస్తోంది.

కాగా, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పాకిస్తాన్ వాణిజ్య లోపు 60శాతం పెరగడం గమనార్హం. మే నెలతో ముగిసిన 11నెలల కాలంలో పాకిస్తాన్ ప్రస్తుత వాణిజ్య లోటు మరో రెండింతలు పెరిగి 8,9బిలియన్ డాలర్లుగా నమోదైంది. రూపాయికి బలం చేకూర్చడంతో ప్రస్తుత లోటును తగ్గించవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు.

English summary
Pakistan’s rupee plunged the most in nine years, after the central bank was said to have devalued the currency as South Asia’s second largest economy showed signs of stress ahead of elections next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X