వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయి పతనంతో ఆనందం: మనదేశానికి భారీగా డబ్బులు పంపిస్తున్నారు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూపాయి మారకం రోజు రోజుకు పడిపోతుండటంపై మనదేశంలో ఆందోళన వ్యక్తమవుతుంటే విదేశాల్లోని భారతీయులకు మాత్రం ఆనందం కలిగిస్తోంది. అందుకే డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో విదేశాల్లోని భారతీయులు క్యాష్ చేసుకుంటున్నారు.

ఈ వీడియో ఆశ్చర్యపరుస్తుంది: విమానం నుంచి సరస్సులోకి చేపల వర్షం!ఈ వీడియో ఆశ్చర్యపరుస్తుంది: విమానం నుంచి సరస్సులోకి చేపల వర్షం!

రూపాయం పతనంలో పెరిగిన జీతం మొత్తం

రూపాయం పతనంలో పెరిగిన జీతం మొత్తం

దిర్హమ్‌ల రూపంలో అందుకునే జీతంలో ఎలాంటి తేడా లేకపోయినప్పటికీ భారతీయులు యూఏఈలో తీసుకునే జీతం మొత్తం మాత్రం గత ఏడాది కంటే 10శాతం పెరగడం గమనార్హం. రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడంతో వారం రోజులకోసారి మనీ ఎక్ఛేంజీ కేంద్రాల ద్వారా విదేశాల్లోని భారతీయులు తమ స్వస్థలాలకు ఎక్కువ డబ్బును పంపించేస్తున్నారు.

భారీగా డబ్బు పంపిస్తున్నారు..

భారీగా డబ్బు పంపిస్తున్నారు..

కాగా, బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.66గా కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ పడిపోవడాన్ని విదేశాల్లోని భారతీయులు తమకు అనుకూలంగా మార్చుకుని తమ ఇళ్లకు ఎక్కువ డబ్బును పంపించేస్తున్నారు. గురువారం ఒక రూపాయికి 19.3 దిర్హమ్‌లు ట్రేడవుతోంది.

వచ్చే డబ్బులు పెరిగాయి..

వచ్చే డబ్బులు పెరిగాయి..

రూపాయి విలువ పతనం ఇండియాకు ఎక్కువ మొత్తంలో డబ్బులు పంపించేందుకు వీలుగా మారిందని యూఏఈలో హోటల్ మేనేజర్‌గా పనిస్తున్న ఫైజల్ జురానీ తెలిపారు. దుబాయి మాల్‌లో రూపాయి మారకంను ఎప్పుటికప్పుడు గమనిస్తూ డబ్బును పంపించేస్తున్నట్లు తెలిపారు. దిర్హమ్‌కు వచ్చే రూపాయల మొత్తం పెరిగిందని చెబుతున్నారు.

 లాభం పొందుతున్నామని ఆనందం

లాభం పొందుతున్నామని ఆనందం

ప్రతి నెల తాను 700దిర్హమ్‌లను ఇండియాలోని తన ఇంటికి పంపించేవాడినని చెప్పిన ఎలక్ట్రిషియన్ అహ్మద్ రెహబా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పంపిస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబం తను పంపించే డబ్బుపైనే ఆధారపడి ఉందని, ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడంతో ఎక్కువ లాభం పొందుతున్నట్లు ఆనందంగా తెలిపారు.

అప్పులు తీరుతున్నాయి..

అప్పులు తీరుతున్నాయి..

తాము తీసుకున్న అప్పులు కూడా తీర్చుకునేందుకు సానుకూల వాతావరణ ఏర్పడిందని చెప్పారు. ఎక్కువ మొత్తం రావడంతో అప్పులు తీర్చేస్తున్నామని తెలిపారు. యూఏఈ ఎక్ఛేంజీ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ శెట్టి మాట్లాడుతూ.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇక్కడి భారత ఉద్యోగులు లాభాలు పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా, రూపాయి మారకం పతనమవుతుండటంతో ఇతర దేశాల్లోని భారతీయులు కూడా ఇండియాకు ఎక్కువ మొత్తం డబ్బును పంపించే అవకాశం లభించింది.

English summary
Indian expatriates are rushing to send money home after the rupee slumped to a new record low against the dollar. The Indian currency has fallen by about 10 per cent this year alone, a significant drop compared to recent years, according to experts. Although in dirhams their wages remain the same, a worker is able to send 10 per cent more rupees now compared to last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X