వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా మొఘల్ మాజీ భార్యతో పుతిన్ డేటింగ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన మరో రూమర్ హల్‌చల్ చేస్తోంది. కరాటే యోధుడిగానే కాక లవర్ బాయ్‌గా పుతిన్‌ను అభివర్ణిస్తూ ప్రపంచ మీడియా లెక్కలేనన్ని కథనాలను రాసింది.

తాజాగా అమెరికాకు చెందిన ఓ పత్రిక పుతిన్‌కు సంబంధించి ఓ సంచలన కథనాన్ని రాసింది. మీడియా మొఘల్‌గా ప్రసిద్ధిగాంచిన మర్దోక్ మాజీ భార్య వెండీ డెంగ్‌తో పుతిన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని ఆ పత్రిక రాసింది.

Rupert Murdoch's Ex-Wife Wendi Deng Is Dating Vladimir Putin

పుతిన్ 2013లో తన భార్యకు విడాకులిచ్చారు. ఆ తర్వాత పలువురు ప్రముఖ మహిళలతో ప్రేమాయణం నెరపుతున్నారని కథనాలు వచ్చాయి. తాజాగా రూపర్ట్ మర్దోక్ మాజీ భార్యతోనూ ఆయన డేటింగ్ చేస్తున్నాడంటున్నారు.

ఇప్పటిదాకా పుతిన్, వెండీ డెంగ్‌లు ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే పుతిన్ హాలీడే స్పాట్‌గా పేరొందిన సెయింట్ బార్ట్ తీరంలో వెండీ డెంగ్ లగ్జరీ బోట్ పార్క్ చేసి కనిపించడంతో.. దాని ఆధారంగా అమెరికా పత్రిక ఈ కథనాన్ని రాసిందని తెలుస్తోంది.

English summary
Rupert Murdoch's Ex Wife Wendi Deng Is Dating Vladimir Putin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X