వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు మేం చూడొద్దా?: అమెరికాపై రష్యా ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా పైన రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశానికి చెందిన దౌత్య ప్రతినిధులను అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలను పరిశీలించకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అంగీకారయోగ్యం కాదని చెప్పింది.

మాస్కోలో ఉన్న అమెరికా రాయబారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తాము రష్యా ప్రతినిధిని అడ్డుకోలేదని చెప్పారు.

తమ దేశ దౌత్య ప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని అమెరికా అధికారులు ఇప్పటికే అదేశించారని, కొన్ని దౌత్య దేశాల్లో దౌత్యవేత్తలకు చేసే బెదిరింపు చర్యల మాదిరిగానే ఉన్నాయని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

 Russia blasts US for barring its diplomats from observing poll

హ్యూస్టన్‌లో అయితే ఏకంగా హాలీవుడ్ యాక్షన్ సినిమా పద్ధతిలో కట్టుదిట్టంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, తమ దేశ జనరల్ కాన్సులేట్‌కు చెందిన అధికారి కారును నిలిపివేసి అడ్డుకున్నారని రష్యా ఆరోపించింది.

తమ జనరల్ కాన్సులేట్ కారును అడ్డుకున్నారని, అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు చూడవద్దని, ఆ ఆలోచన చేయవద్దని అభిప్రాయపడ్డారని చెప్పారు. వారి తీరు ఎలా ఉందంటే.. మా ఎన్నికల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని అడిగినట్లుగా ఉందన్నారు.

English summary
Moscow on Tuesday blasted the US for curbing Russian diplomats access to polling stations to observe the presidential election, calling the move "unacceptable". But the US embassy in Moscow denied that the diplomats were barred from observing the vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X