వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో ఉగ్ర స్థావరాలపై రష్యా అటాక్... క్షిపణి దాడి ఇలా... (వీడియో)

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై ర‌ష్యా శుక్రవారం శక్తివంతమైన క్షిపణులను ప్ర‌యోగించింది. మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఉన్న రెండు యుద్ధ నౌక‌లు, ఒక స‌బ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్స్‌ను లాంచ్ చేశా

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మాస్కో: సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై ర‌ష్యా శుక్రవారం శక్తివంతమైన క్షిపణులను ప్ర‌యోగించింది. మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఉన్న రెండు యుద్ధ నౌక‌లు, ఒక స‌బ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్స్‌ను లాంచ్ చేశారు.

చదవండి: ఒమర్ అలియాస్ సుబ్రహ్మణ్యం: ఫేస్ బుక్ లో పరిచయం.. ఐసిస్ వైపు పయనం

ఈ విష‌యాన్ని ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ ధృవీక‌రించింది. ట‌ర్కీ, ఇజ్రాయెల్ మిలిట‌రీకి ఈ దాడుల విష‌యాన్ని ముందుగానే చెప్పిన‌ట్లు ర‌ష్యా వెల్ల‌డించింది. అమెరికా విష‌యాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

russia-attack-syria

ముంద‌స్తు సమాచారం లేకుండా సిరియా యుద్ధ విమానాన్ని అమెరికా కూల్చేయ‌డంతో గ‌త సోమ‌వారం నుంచి సిరియా మిల‌ట‌రీ ఆప‌రేష‌న్స్‌పై ఆ దేశానికి ర‌ష్యా స‌మాచారం ఇవ్వ‌డం లేదు.

సిరియాలోని హమా ప్రాంతంలో ఉన్న ఐసిస్ క‌మాండ్ సెంట‌ర్లు, ఆయుధాగారాల‌పై ఆరు కాలిబ‌ర్ క్రూయిజ్ మిస్సైల్స్‌ను ప్ర‌యోగించిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. హఠాత్తుగా రష్యా క్షిపణి దాడులు చేయడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు షాక్ తిన్నారు.

ఐసిస్ ఉగ్రవాదులకు ఈ దాడులతో భారీగా న‌ష్టం వాటిల్లిందని, అనంతరం అదే ప్రాంతంలో వెంట‌నే వైమానిక దాడులు కూడా చేయ‌డంతో ఉగ్ర‌వాదుల మిగ‌తా స్థావ‌రాలు కూడా ధ్వంస‌మైన‌ట్లు రష్యా వెల్ల‌డించింది.

English summary
Russian warships and a submarine have launched a 'massive missile strike' on ISIS targets in Syria, the country's defense ministry said. Frigates Admiral Essen and Admiral Grigorovich, and submarine Krasnodar, launched six Kalibr cruise missiles at ammo dumps and command posts located in Hama and near the town of Akerbat, the ministry said. The strikes destroyed ammunition, weapons, and an 'arsenal of fighters' - before bombers moved in to finish off the survivors, according to the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X