వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా సరికొత్త చరిత్ర: నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం

|
Google Oneindia TeluguNews

గతవారం రష్యా ఓ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అకడెమిక్ లోమోనోసవ్ అణువిద్యుత్ కేంద్రంను ప్రారంభించింది. అయితే ఇందులో కొత్తదనం ఏముందని మీకు డౌటు రావొచ్చు.. ఈ అణువిద్యుత్ కేంద్రంను ఆర్కిటిక్ మహాసముద్రంపై నిర్మించింది. అంటే ఇది నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రం. ఇక గతవారం ఈ అణువిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ ద్వారా క్రిస్మస్ చెట్టును ముందుగా వెలిగించడం జరిగింది. అకడెమిక్ లోమోనోసవ్ అణువిద్యుత్ కేంద్రంపై చాలామంది పలు రకాలుగా విమర్శలు గుప్పించారు. అవేమీ పట్టించుకోకుండా రష్యా ముందుకు వెళ్లి విజయం సాధించింది.

తేలియాడే ఈ అణువిద్యుత్ కేంద్రం నుంచి ఆర్క్‌టిక్ సిటీ అయిన పెవెక్‌కు విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. పెవెక్ నగరంలో జనాభా 5వేల మంది. అంతేకాదు అకడెమిక్ లోమోనోసవ్ విద్యుత్ కేంద్రం ఈ చిన్న నగరానికి పెద్ద కానుకే అని చెప్పాలి. ఎందుకంటే పెవెక్ నగరంలో ఉష్ణోగ్రతలు మైనస్ 11 ఫారెన్‌హీట్‌తో ఉంటాయి. ఈ విద్యుత్ కేంద్రం నుంచి విడుదలయ్యే వేడిని ఇక్కడి ప్రజలు అనుభవిస్తారు. బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే అకడెమిక్ లోమోనోసవ్ విద్యుత్ కేంద్రం ప్రారంభించడం జరిగింది. బొగ్గుతో అయితే కాలుష్యం కూడా పెరుగుతుందని రష్యా ప్రభుత్వం భావించి ఈ న్యూక్లియర్ ప్లాంట్‌ను తీసుకొచ్చింది.

Russia creates history by launching flaotin Nuclear Powerplant in Arctic Ocean

ఇక కొన్నేళ్ల కిందట ఏర్పాటైన బిలిబినో అణువిద్యుత్ కేంద్రంకు కొత్తగా వచ్చిన అకడెమిక్ లోమోనోసవ్ విద్యుత్ కేంద్రం రీప్లేస్ చేయనుంది. ఇదిలా ఉంటే బిలిబినో ప్లాంట్ లైసెన్స్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. బిలిబినో అణువిద్యుత్ కేంద్రాన్ని 1974లో నిర్మించడం జరిగింది. దీని సామర్థ్యం 48 మెగావాట్లు. ఇక కొత్త అణువిద్యుత్ కేంద్రం రావడంతో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రంతో పాటు బిలిబినో అణువిద్యుత్ కేంద్రంను కూడా మూసివేయాలని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాదిలోగా బిలిబినో అణువిద్యుత్ కేంద్రంను మూసివేయనున్నట్లు సమాచారం. అయితే మూసివేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు బిలిబినో అణువిద్యుత్ కేంద్రంకు మరో ఐదేళ్ల పాటు లైసెన్స్‌ను ఎందుకు పొడిగించాల్సి వచ్చిందన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది.

English summary
Last week Russia made history by flipping the power switch on the “Akademik Lomonosov,” a cutting-edge nuclear power plant afloat in the Arctic Ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X