వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీపై రష్యా తాజా ప్రకటన: అది భారత్‌కే సాధ్యం: భాగస్వామ్యం కోసం

|
Google Oneindia TeluguNews

మాస్కో: ప్రపంచాన్ని చుట్టబెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి రూపొందించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టిన తొలిదేశంగా గుర్తింపు పొందింది రష్యా. తాను కనిపెట్టిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌పై రష్యా తాజా ప్రకటన చేసింది. ఈ వ్యాక్సిన్‌ను కనిపెట్టింది తామే అయినప్పటికీ.. దాన్ని భారీగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందని వెల్లడించింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ మాస్ ప్రొడక్షన్ కోసం భారత్ సహకారాన్ని, భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని పేర్కొంది.

మోడీ కేబినెట్‌లో కలకలం: మరో కేంద్రమంత్రికి కరోనా: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతోమోడీ కేబినెట్‌లో కలకలం: మరో కేంద్రమంత్రికి కరోనా: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో

జనాభా అవసరాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి భారత్ భాగస్వామ్యం కోసం తాము ఎదురు చూస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని తాము గమనిస్తున్నామని వెల్లడించింది. వ్యాక్సిన్‌ తయారీకి లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని.. ప్రస్తుతం తాము భారత్‌తో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో డిమిత్రియేవ్ తెలిపారు.

Russia expressed Indias ability to mass produce Covid Vaccine and looking for collaboration

కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్‌ వీ ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం అత్యవసరమని తాము భావిస్తున్నట్లు డిమిత్రియేవ్ తెలిపారు.
ఈ అంశంపై భారత్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని కూడా పేర్కొన్నారు. మాస్ ప్రొడక్షన్ కోసం భారత్‌ను సంప్రదించామని, ఇంకా తన స్పందనను తెలియజేయలేదని అన్నారు. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న తరవాతే దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తితో పాటు ఎగుమతికి అనుమతి కోరినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Recommended Video

: Fact Check : Did Putin’s Daughter Die After Taking COVID-19 Vaccine?

భారత్‌‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బ్రెజిల్‌లో కూడా స్పుత్నిక్‌-వీ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని డిమిత్రియేవ్ తెలిపారు. మొత్తం అయిదు దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలని భావిస్తున్నామని, అందులో భారత్‌కే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీలో వ్యాక్సిన్‌కు అధిక డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఆసియా దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు.

English summary
Russia, which became the first country in the world to give regulatory approval to COVID-19 vaccine, has expressed confidence in India's ability to mass produce Sputnik V' and is looking for collaboration. Kirill Dmitriev, CEO of the Russian Direct Investment Fund (RDIF), said on Thursday that India is among countries with "extreme production capacities. He said production of the vaccine is an important issue and they were looking for a partnership with Indian firms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X