• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆశ్చర్యం.. అద్భుతం: గాలిలో గల్లంతైన విమానం -చివరికి నేలపై ఇలా -అందరూ సేఫ్, హీరో పైలట్స్

|

ప్రయాణ సౌకర్యం సంగతి పక్కన పెడితే, ప్రమాదాల కోణంలో విమానాలు ఎంత డేంజరో అందరికీ తెలిసిందే. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ గల్లంతైన విమానాలను కనిపెట్టలేని దుస్థితి. కొన్ని సంఘటనల్లో శవాలుగానీ, విమాన శకలాలుగానీ లభించని పరిస్థితి. అటు రష్యాలో వరుసగా చోటుచేసుకుంటోన్న విమాన ప్రమాదాలు కలవరపెడుతుండగా, శుక్రవారం నాడు మరో తేలికపాటి విమానం గల్లంతు కావడంతో కలకలం రేగింది. కానీ చివరికి ఆశ్చర్యకరమైన రీతిలో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలివి..

పారిపోడానికి సిద్ధంగా కేసీఆర్ బినామీలు -భారీ కుంభకోణం -ఐజీ ప్రభాకర్‌ పైనా -రేవంత్ రెడ్డి తాజా బాంబుపారిపోడానికి సిద్ధంగా కేసీఆర్ బినామీలు -భారీ కుంభకోణం -ఐజీ ప్రభాకర్‌ పైనా -రేవంత్ రెడ్డి తాజా బాంబు

వేల అడుగుల ఎత్తులో గల్లంతు

వేల అడుగుల ఎత్తులో గల్లంతు


రష్యాలోని సైబీరియాలో ప్రాంతీయ విమానాలను నడిపే చిన్న ‘సిలా'అనే విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ ఒకటి శుక్రవారం గల్లంతైంది. కేడ్రోవి పట్టణం నుంచి టాంస్క్‌ నగరానికి వెళ్తుండగా రాడార్ నుంచి తప్పిపోయిందా విమానం. అందులో పైలట్ సహా 19 మంది ఉన్నారు. విమానం అదృశ్యం గురించి తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది..

మోదీ సార్.. చాలా థ్యాంక్స్, ఏపీకి గొప్ప సహాయం చేస్తున్నారు: సీఎం జగన్ -కరోనా కట్టడి, వ్యాక్సిన్లపై -videoమోదీ సార్.. చాలా థ్యాంక్స్, ఏపీకి గొప్ప సహాయం చేస్తున్నారు: సీఎం జగన్ -కరోనా కట్టడి, వ్యాక్సిన్లపై -video

హెలికాప్టర్లతో గాలింపు

హెలికాప్టర్లతో గాలింపు


గల్లంతైన విమానాన్ని కనిపెట్టేందుకు టెక్నికల్ గా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో రెస్క్యూహెలికాప్టర్లను రంగంలోకి దించారు. సుమారు ఐదారు గంటలపాటు నాలుగైదు హెలికాప్టర్లు అనుమానిత ప్రాంతంలో గాలింపు చేయగా, చివరికి నేలపై తలకిందులుగా పడిఉన్న విమానం కనపడింది. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. ప్రాణాలతోనే మిగిలున్న మొత్తం 19 మందినీ కాపాడి, సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

అశ్చర్యం.. అందరూ సేఫ్..

అశ్చర్యం.. అందరూ సేఫ్..

వేల అడుగుల ఎత్తులో గల్లంతైన విమానం, రాడార్ పరిధిలో లేకుండా గంటలపాటు ప్రయాణించి, చివరికి నేలపై హార్డ్ ల్యాండింగ్ కావడం, అది కూడా విమానంలోని 19 మంది సురక్షితంగా బయటపడటం నిజంగా అద్భుతం, ఆశ్చర్యంగా ఉందని రష్యా అధికారులు చెప్పారు. తేలికపాటి విమానం కావడం, పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని హార్డ్ ల్యాండింగ్ చేయడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లు(అనాటొలి పెత్రోవ్(56), ఫరూహ్ కాసనోవ్(32)లను రష్యా ప్రజలు, మీడియా హీరోలుగా కీర్తిస్తున్నారు.

ఆ 28 మంది శవాలూ దొరకలేదు

ఆ 28 మంది శవాలూ దొరకలేదు

పది రోజులజ క్రితం రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్‌- కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్‌ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్‌ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్‌ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను ఢీకొట్టి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు.

English summary
All 19 people on board a Russian Antonov An-28 passenger plane that vanished from radars in Siberia survived after the aircraft made a hard landing on Friday, the emergencies ministry said. The aircraft – operated by SiLA, a small airline offering regional flights in Siberia – went missing while flying from the town of Kedrovy to the city of Tomsk. However, the aircraft was located after helicopters were dispatched to search for it. The ministry said all 19 people on board had survived and were now being evacuated from the site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X