• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రష్యా కొత్తతరం అణ్వాయుధం.. అమెరికాయే కాదు, ఏ దేశమైనా.. ప్రపంచంలో ఎక్కడున్నా స్మాష్!

By Ramesh Babu
|

మాస్కో: అమెరికా, రష్యా అగర్భ శత్రువులు. ఇప్పుడేదో పాపం రష్యా చతికిలపడిపోయి ఇలా ఉందిగానీ.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన దేశమది. రష్యాను చూసి అమెరికా సైతం వణికిన రోజులూ లేకపోలేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. రష్యా తాను కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు లోలోపల ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.

చదవండి: చంద్రుడిపై తొలి 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్! వచ్చే ఏడాదే వొడాఫోన్ ప్రయోగం...

రక్తమోడుతున్న బాల్యం, తల్లడిల్లుతున్న సోషల్ మీడియా, 'ప్రే ఫర్ సిరియా' హ్యాష్‌ట్యాగ్‌తో...

తాజాగా కొత్తతరం అణ్వాయుధాలను రష్యా అభివృద్ధి చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం స్వయంగా వెల్లడించారు. తాము తయారు చేసిన అణ్వాయుధాలకు అమెరికాను సైతం తుదముట్టించగల సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. శత్రుదేశాల భద్రతా వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేయగల సత్తా ఈ కొత్తతరం అణ్వాయుధాల సొంతమట.

 పక్కలో బల్లెంలా రష్యా...

పక్కలో బల్లెంలా రష్యా...

రష్యా మళ్లీ అగ్రరాజ్యం అమెరికాకు పక్కలో బల్లెంలా మారనుంది. కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోయిన రష్యా మళ్లీ అమెరికాను చూసి తలెగరేయనుంది. రష్యా ఆర్థికంగా దెబ్బతినడంతో క్రమంగా ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని అమెరికా తన చేతుల్లోకి తీసుకుంది. ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తీసుకొస్తూ తనకు తందాన పలికేలా చేసుకుంటోంది. ఉత్తరకొరియాపై హూంకరించినా, సిరియాపై దాడులకు పాల్పడినా, చైనాను ఛీకొట్టినా.. ప్రస్తుతానికి అగ్రరాజ్యం అమెరికాకు ఎదురేలేదు. కానీ అమెరికా పెత్తనం ఇక ఎంతోకాలం సాగదు. రష్యా మళ్లీ తన పునర్వైభవాన్ని సంతరించుకుంటోంది.

 ఢీ అంటే ఢీ అన్న రష్యా...

ఢీ అంటే ఢీ అన్న రష్యా...

ఒకప్పుడు అమెరికాను ఢీ అంటే ఢీ అన్న రష్యా ఆ తరువాత క్రమంగా ప్రపంచ దేశాలపై పట్టుతోపాటు తన ప్రాభవాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు తిరిగి పుంజుకునేందుకు అది శతవిధాలా ప్రయత్నిస్తోంది. సైనిక శక్తి పరంగా ఒకప్పుడు అమేయంగా ఉన్న రష్యా మళ్లీ తిరిగి తన మునుపటి సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. తాజాగా కొత్తతరం అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది. ఆ ఆయుధాలకు ఎదురే లేదని చెబుతోంది. వాటిని ప్రయోగిస్తే.. అగ్రరాజ్యం అమెరికా కూడా ముక్కలవ్వాల్సిందేనంటూ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం స్వయంగా ప్రకటించడం విశేషం.

 కొత్తతరం ఆణ్వాయుధాల అభివృద్ధితో...

కొత్తతరం ఆణ్వాయుధాల అభివృద్ధితో...

గురువారం మాస్కోలో ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ రష్యా తయారుచేసిన కొత్తతరం అణ్వాయుధాలను గురించి ప్రకటించారు. వీటిలో ఒకటి అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్రూయిజ్ మిస్సైల్ కాగా మరొకటి సముద్రగర్భంలో ప్రయాణించగల అణ్వాయుధ సామర్థ్యంగల డ్రోన్. ఇప్పటికే ఈ క్రూయిజ్ మిస్సైల్‌ను రష్యా పరీక్షించినట్లు పుతిన్ చెప్పారు. రష్యా రూపొందించిన ఈ మిస్సైల్ ఎటువంటి భద్రతా కవచాన్నైనా ఛేదించుకుని వెళ్లి లక్ష్యాన్ని తాకగలదని ఆయన పేర్కొన్నారు. ఇక నీటిలో ప్రయాణించే డ్రోన్ కూడా అత్యంత వేగంగా అణ్వాయుధాలను మోసుకెళ్లి సముద్రంలోని శత్రుదేశాల విమాన వాహక నౌకలను భస్మీపటలం చేయగలదని తెలిపారు.

మహాక్షిపణి ‘ఆర్ఎస్-28 సర్మత్'...

మహాక్షిపణి ‘ఆర్ఎస్-28 సర్మత్'...

రష్యా ఇప్పటికే ఓ అత్యాధునిక మహా ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దీనిపేరు ‘ఆర్ఎస్-28 సర్మత్'. 100 టన్నుల బరువుండే ఈ మహా ఖండాంతర క్షిపణి 10 పెద్ద, లేదంటే 16 చిన్న అణుబాబులను ఒకేసారి మోసుకెళ్లగలదు. ఈ భారీ క్షిపణిని ఒకసారి ప్రయోగిస్తే సువిశాల భూభాగాన్ని మరుభూమిగా మార్చివేయగలదు. ఇప్పటికే రష్యా వద్ద ఉన్న ‘ఎస్‌ఎస్-18 శాటన్' క్షిపణుల స్థానంలో ఈ మహా క్షిపణులతో భర్తీ చేయాలనేది అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలోచన. ఈ సర్మత్ క్షిపణులు దేశాలకు దేశాలనే బూడిద కుప్పలుగా మార్చగలవు. రష్యా మకాయెవ్ రాకెట్ డిజైన్ బ్యూరోలో ఈ సర్మత్‌ మహా క్షిపణులను రూపొందించింది.

 ఉపగ్రహాల్ని నాశనం చేసే లేజర్లు!

ఉపగ్రహాల్ని నాశనం చేసే లేజర్లు!

భవిష్యత్తులో యుద్ధం భూమ్మీద కాదు, అంతరిక్షంలో జరుగనుంది. భూ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలను దేశాలు పరస్పరం లక్ష్యంగా చేసుకోనున్నాయి.ప ఇందుకోసం అవసరమయ్యే అత్యంత శక్తిమంతమైన లేజర్ల అభివ‌ృద్ధికి ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ విషయంలో రష్యా కాస్త ముందంజలో ఉంది. ఇప్పటికే ఈ రకం లేజర్లను అది అభివృద్ధి చేసినట్లు తాజా సమాచారం. దీనిపై అమెరికా, చైనాలు లోలోపల ఆందోళన చెందుతున్నాయి.

 రష్యా చర్యతో అమెరికాలో ఆందోళన...

రష్యా చర్యతో అమెరికాలో ఆందోళన...

రష్యా చర్యతో.. వచ్చే కొన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల మధ్య అంతరిక్ష యుద్ధం సంభవించే అవకాశాలున్నాయని అమెరికా వాయుసేన చీఫ్‌ జనరల్‌ డేవిడ్‌ గోల్డ్‌ఫీన్‌ హెచ్చరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రష్యా ఆయుధాల తయారీదారు ఆల్మజ్‌-యాంటే ఉపగ్రహ నిరోధక కార్యక్రమాన్ని పూర్తిచేసినట్లుగా ఆ దేశ వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్‌ వెల్లడించింది. అయితే ఈ వార్తల్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించకపోయినా.. ఆ దేశ ప్రాధాన్య జాబితాలో ఉపగ్రహ నిరోధక ఆయుధాలు కూడా ఉన్నాయని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ఉపగ్రహాలతో ముప్పే, అందుకే...

అమెరికా ఉపగ్రహాలతో ముప్పే, అందుకే...

అమెరికాతో యుద్ధం తలెత్తే పరిస్థితి వస్తే ఆ దేశ ఉపగ్రహాలు కీలకమైన ముప్పుగా మారతాయని రష్యా భావిస్తుందని శామ్యూల్‌బెండెట్‌ అనే నిపుణుడు వివరించారు. అందుకే ఈ తరహా లేజర్లను అభివృద్ధి చేసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాపై ఆధిపత్యం సాధించేందుకు మరోవైపు అమెరికా, చైనా దేశాలు కూడా ఈ తరహా విధ్వంసక సాంకేతిక పరిజ్ఞానాలపై ఇప్పటికే దృష్టిపెట్టాయని చెబుతున్నారు.

English summary
Russia has tested a new generation of nuclear weapons capable of hitting the US, Vladimir Putin said on Thursday.The Russian president accompanied his announcement with a computer-generated video which showed the missiles arcing towards America on a map of the world. Alec Luhn, The Telegraph's Russia correspondent, tweeted images of the video, which was displayed behind Putin while he made his address, effectively Russia's "State of the Union", to the Federal Assembly in Moscow. Putin said the new range of nuclear weapons would "neutralise" US missile defence, Luhn reported. "Russia remained a nuclear power, but no one wanted to listen to us. Listen to us now," Putin reportedly said.Moreover Russian defense companies have created a plane-mounted laser that can hit satellites — at least according to an anonymous source quoted by Russian news agency Interfax. On Saturday, an Interfax report cited the source as saying that weapons maker Almaz-Antey has “completed work on the anti-satellite complex,” which includes the laser and associated ground control gear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X