• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో స్పుత్నిక్ వి... రష్యా టైఅప్ ఛాన్సెస్.. ఆ కీలక వ్యక్తి నుంచే ప్రకటన...

|

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో తలమునకలయ్యాయి. ఇందులో రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి,బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేస్తున్న ఆస్ట్రాజెనెకాలపై ప్రపంచ దేశాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. భారత్ విషయానికొస్తే రష్యా వ్యాక్సిన్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. అయితే రష్యా ఏ దేశాలకు ప్రాధాన్యతనిస్తుంది... డబ్ల్యూహెచ్ఓ సిఫారసులు ఏమైనా ఉంటాయా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రష్యన్ ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సీఈవో కిరిల్ దిమిత్రివ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు ఆశలు రేపేవిగా మారాయి.

కిరిల్ దిమిత్రివ్ ఏమన్నారు....

కిరిల్ దిమిత్రివ్ ఏమన్నారు....

కోవిడ్ 19 వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి'ని భారత్‌లో తయారుచేసేందుకు తాము చాలా ఆసక్తితో ఉన్నామని కిరిల్ దిమిత్రివ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్‌లో వ్యాక్సిన్ తయారీకి సంబంధిత యంత్రాంగం,తయారీదారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. భారత్‌,భారత్ సైంటిస్టులు,భారత్ తయారీదారులతో తమకు గొప్ప సహకారం ఉందని.. వాళ్లు తమ టెక్నాలజీని బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. భారీ మొత్తంలో కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను తయారుచేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని... అందువల్లే రష్యా భారత్‌ను తమ భాగస్వామిగా చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తోందని చెప్పారు.స్పుత్నిక్ వి తయారీకి రష్యన్ ప్రత్యక్ష పెట్టుబడుల నిధి నుంచే సహకారం అందిన నేపథ్యంలో... స్వయంగా దాని సీఈవోనే భారత్‌లో వ్యాక్సిన్ తయారీకి ఆసక్తి కనబరిచే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అందుకూ సిద్దమే....

అందుకూ సిద్దమే....

'కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీదారులకు భారత్ స్వాగతం పలుకుతుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను మేమూ విన్నాం. వ్యాక్సిన్ సెక్టార్‌లో భారత్ ఇప్పటికే పలు టాప్ కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉంది. అందుకే భారత్‌లో స్పుత్నిక్ వి తయారీకి రష్యా ఆసక్తిగా ఉంది.' అని కిరిల్ దిమిత్రివ్ పేర్కొన్నారు. స్పుత్రిక్ వి మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో జరిపేందుకు తాము సిద్దమేనని చెప్పారు.

టార్గెట్... 40 మిలియన్ల టీకాలు...

టార్గెట్... 40 మిలియన్ల టీకాలు...

'మా లక్ష్యం 40 మిలియన్ల మందికి టీకాలు వేయడం. ప్రస్తుతం భారత్, సౌదీ అరేబియా, యూఏఈ సహా 20 దేశాలతో మేము కలిసి పని చేస్తున్నాము. ఈ వ్యాక్సిన్‌ను చౌకగా,ప్రపంచవ్యాప్తంగా పలు ఉత్పత్తి భాగస్వాములతో కలిసి అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం.' అని దిమిత్రివ్ చెప్పుకొచ్చారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియను రష్యా ఇప్పటికే మొదలుపెట్టింది. అయితే చాలావరకు దేశాలు స్పుత్నిక్ వి పనితీరుపై మరిన్ని శాస్త్రీయ రుజువులు అవసరమని అభిప్రాయపడుతున్నాయి.

అనుమానాలకు ధీటైన బదులు....

అనుమానాలకు ధీటైన బదులు....

స్పుత్నిక్ విపై లేవనెత్తుతున్న అనుమానాలకు రష్యా ధీటుగా బదులిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ను స్పుత్నిక్ వి ఎలా అంతం చేస్తుందో వివరిస్తూ గ‌మేలియా డైర‌క్ట‌ర్ అలెగ్జాండ‌ర్ జింట్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో భూగోళం మొత్తాన్ని కరోనా వైరస్ చుట్టుకుపోవడాన్ని చూపించారు. ఆ తర్వాత స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌తో క్రమంగా ఆ వైరస్ అంతమై... భూమి సాధారణ స్థితికి రావడాన్ని చూపించారు. 1957లో రష్యా లాంచ్ చేసిన ప్రపంచ తొలి కృతిమ భూ ఉపగ్రహం స్పుత్నిక్ 1ని ప్రతిబింబించేలా ఈ వీడియోని రూపొందించారు.

English summary
Mascow is keen to manufacture Covid vaccine Sputnik V in India," says Kirill Dmitriev, the CEO of Russian Direct Investment Fund, which is funding the vaccine that may cure coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X