వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు పుతిన్ షాక్: 'ఉ.కొరియాతో సంబంధాలు తెంచుకోం, ఆంక్షలు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాస్కో: ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు రష్యా నుండి ఊహించని దెబ్బ తగిలింది. వరుసగా ఖండాంతర క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు నిర్వహిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్న ఉత్తరకొరియాకు చెక్ పెట్టాలని అమెరికా చేస్తున్న ప్రయతాలకు ఆదిలోనే దెబ్బ తగిలింది.ఉత్తరకొరియాతో సంబంధాలను తెంచుకోవాలని రష్యాకు అమెరికా చేసిన వినతిని రష్యా తోసిపుచ్చింది.

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?

ఉత్తరకొరియా తాజాగా ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహించడంతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు ఇతర దేశాల సహయాన్ని కోరుతోంది.

కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'

ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా దేశాలు ఈ విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకొన్నా ఆ నిర్ణయానికి మద్దతిచ్చే అవకాశం కన్పిస్తోంది. అయితే చైనా, రష్యా లాంటి దేశాల మద్దతు అమెరికాకు కీలకంగా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఆ దేశాల మద్దతు కోరేందుకు సమాయత్తమౌతున్నారు.

అమెరికాకు షాకిచ్చిన రష్యా

అమెరికాకు షాకిచ్చిన రష్యా

ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది. ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకోవాలంటూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌లో కోరారు. అయితే ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకునేది లేదని పుతిన్‌ స్పష్టం చేసినట్లు రష్యా మీడియా వర్గాలు ప్రకటించాయి.

కఠినమైన ఆంక్షలు ఉత్తరకొరియాపై

కఠినమైన ఆంక్షలు ఉత్తరకొరియాపై

వరుసగా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు ఉన్నవిషయాన్ని రష్యా గుర్తు చేసింది.అంతమించి చర్యలు తీసుకోవాల్సి అవసరం లేనట్లు అమెరికాకు రష్యా తెలిపింది. అమెరికా తీసుకుంటున్న చర్యలు.. ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని రష్యా పేర్కొంది.

ఉ.కొరియా యుద్దం కోరుకొంటుంది

ఉ.కొరియా యుద్దం కోరుకొంటుంది

ఉత్తరకొరియా యుద్దం కోరుకొంటుందనే అభిప్రాయాన్ని అమెరికా వ్యక్తం చేసింది. ఈ విషయమై ఉత్తరకొరియా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అభిప్రాయం ఉందని అమెరికా హెచ్చరించింది. యుద్దమే జరిగితే ఉత్తరకొరియాను నాశనం చేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా రాయబారి నిక్కీ హేలీ, అమెరికా సేనేటర్ వేర్వేరుగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఉత్తరకొరియాతో అమీతుమీకి దక్షిణ కొరియా రెడీ

ఉత్తరకొరియాతో అమీతుమీకి దక్షిణ కొరియా రెడీ

ఉత్తరకొరియాతో అమీతుమీకి దక్షిణ కొరియా కూడ సిద్దమైంది. ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన వెంటనే దక్షిణ కొరియా కూడ వెంటనే క్షిపణిని ప్రయోగించింది. అయితే ఈ క్షిపణి ప్రయోగంతో తాము కూడ దేనికైనా సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకొంటున్న పరిణామాలు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

English summary
Russian Foreign Minister Sergey Lavrov has rejected the US call to cut ties with North Korea after Pyongyang launched ballistic missiles on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X