వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కోవిడ్ వ్యాక్సిన్ ఈ వయస్సు ఉన్న వారికి మాత్రమే : ఆరోగ్యశాఖ నిపుణులు

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది రష్యా. ఇప్పటికే కరోనావైరస్‌ ప్రపంచదేశాలను కుదిపేస్తున్న క్రమంలో అన్ని దేశాలు వ్యాక్సిన్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే పలు దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇక అందరికంటే ముందు రష్యా తీసుకువచ్చిన వ్యాక్సిన్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. అయితే రష్యా తీసుకొచ్చిన వ్యాక్సిన్‌పై అక్కడి ఆరోగ్యశాఖ నిపుణులు సంచలనమైన ప్రకటన చేశారు.

రష్యా తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి మాత్రమే సూచిస్తున్నట్లు ఆ దేశ ప్రముఖ ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లకు పైబడి వయసున్నవారిలో మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని చెప్పారు. రష్యాలో అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 18 ఏళ్లలోపు వయస్సున్న వారికి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అంతేకాదు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు, 60 ఏళ్లు వయసు పైబడినవారికి కూడా సర్టిఫై చేయాల్సి ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌కు సబంధించి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం వీరికి మాత్రమే వ్యాక్సిన్‌ను సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్‌పెర్ట్స్. 60ఏళ్ల పైబడిన వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకపోవడంతో వ్యాక్సిన్‌ను వారికి సూచించడం లేదు.

Russias Covid Vaccine is recommended only for 18-60 Age group people:Experts

ఇదిలా ఉంటే ఈ వైరస్ తయారైన గమలేయ సైంటెఫిక్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ మరియు మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ కూడా ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. తనకు బాగానే ఉందని చెప్పారు. గింట్స్ బర్గ్ వయస్సు 60 ఏళ్లకు పైగానే ఉంది. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ మరో రెండువారాల్లో సిద్దమవుతుందని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ చెప్పారు. వాలంటరీ పద్ధతిన డాక్టర్లతో పాటు ఇతర సామాన్య ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

కరోనావైరస్‌కు విరుగుడు కనిపెట్టిన తొలిదేశంగా రష్యా అవతరించిందని మంగళవారం రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్‌కు సంబంధించి తొలిదశ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ ఏడాది ఆగష్టు 1తో పూర్తయ్యాయని రష్యా ప్రకటించింది. దీనికి స్పుట్‌నిక్ వీ అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు అందరూ ఆరోగ్యంతో బాగున్నారని రష్యా ప్రకటించింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని స్పష్టం చేసింది. బలమైన యాంటిబాడీలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేలా వ్యాక్సిన్ రూపొందించడం జరిగిందని రష్యా పేర్కొంది.

English summary
A top Russian health experts that its new coronavirus vaccine is recommended to be used for individuals aged from 18 to 60 as of now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X