వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

91.4 శాతం: స్పూత్నిక్-వీ వ్యాక్సిన్ తాజా క్లినికల్ ట్రయల్స్.. 26 వేల మందికి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఏ వ్యాక్సిన్ ఎంతమేర ప్రభావం చూపిస్తుందో అనే అంశంపై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ కోసం తొలుత క్లినికల్ ట్రయల్ చేసిన రష్యాకు చెందిన స్పూత్నిక్-వీ వ్యాక్సిన్ గురించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్ 91.4 సమర్థంగా పనిచేస్తోందని చివరి క్లినికల్ ట్రయల్స్ వెల్లడించాయి.

స్పూత్పిక్ వీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 21 రోజుల తర్వాత దాని సమర్థతను విశ్లేషించారు. మూడు, చివరి దశలో 78 కేసులను పరిశీలించారు. ఫైనల్ స్టేజీలో 90 శాతం వరకు ఎఫిషీయన్సీ వచ్చిందని పేర్కొన్నారు. ప్లేసిబో, టీకా సమూహాలలో వాలంటీర్లు 20, 39, 78 మందిని పరీక్షించారు. వారికి కలిగిన అన్నీ వివరాలను నిశీతంగా పరిశీలించారు.

Russias Covid vaccine Sputnik-V shows 91.4% efficacy in clinical trials..

రష్యాలో మూడో విడతలో 26 వేల మంది వాలంటీర్లకు టీకాలు వేయించారు. వారి రోగ నిరోధక శక్తి గురించి గమలేయా కేంద్రం తెలియజేసింది. తాజా పరిశోధనలో సామర్థ్యం బాగానే ఉంది అని పేర్కొన్నది. ఈ వ్యాక్సిన్ మెరుగైన ఫలితం వస్తోంది. అన్నీ దశల పరిశీలన పూర్తయితే.. ఆరోగ్యశాఖ నుంచి అనుమతి వస్తే.. వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభిస్తారు. రష్యా తర్వాత మిగతా దేశాలకు కూడా సప్లై చేసే అవకాశం ఉంటుంది.

English summary
Russia's experimental coronavirus vaccine Sputnik-V shows the efficacy of 91.4 per cent based on data analysis of the final control point of clinical trials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X