వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా అమ్ములపొదిలో సర్మట్ క్షిపణి

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా మరో ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి ద్వారా అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొనే అవకాశం ఉందని రష్యా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో ప్రపంచదేశాల్లో కలవరం మొదలైంది.

ప్రపంచంలోని అగ్రదేశాల మధ్య పోటీ తీవ్రమైంది. ఈ తరుణంలో రష్యా పరీక్షించిన క్షిపణి ప్రయోగం మరోసారి ప్రపంచదేశాల్లో అలజడికి కారణమైంది అగ్రదేశాలు అణ్వాయుధాలను పెంచుకొంటున్నాయి. ఒక దేశానికంటే మరో దేశం బలమైన అణ్వాయుధాలను తయారు చేసుకొంటున్నాయి ఈ పోటీ భవిష్యత్‌లో ఏ రకమైన పరిణామాలకు దారితీస్తోందోననే ఆందోళన లేకపోలేదు.

Russia: Test-Launch of Newest Sarmat ICBM

శుక్రవారం నాడు రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. నిర్ధేశించిన లక్షాన్ని ఈ క్షిపణి చేరుకొందని రష్యా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. ఒక్క సర్కట్ క్షిపణిని ఎదుర్కొనేందుకు 500 అమెరికా ఏబిఎస్ క్షిపణులు అవసరమని రష్యా రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఏక కాలంలో 10 టన్నుల పేలోడ్‌ను సర్మట్ మోసుకెళ్ళే అవకాశం ఉందన్నారు. 20 మాక్‌ల వేగాన్ని ఒక సెకన్ కాలంలో ఈ క్షిపణి అందుకొంటుందని రష్యా ప్రకటించింది. 2021 నాటికి రష్యా రక్షణ విభాగంలో ఈ క్షిపణి అందుబాటులోకి రానుంది.

ఈ క్షిపణి బరువు సుమారు 200 టన్నులు. ప్రపంచంలోనే అత్యంత భారీ ఐసీబీఎంగా పేరున్న సాతాన్ క్షిపణి స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.ఉత్తర, దక్షిణ దృవాల గుండా ప్రయాణం చేస్తూ ప్రపంచంలోని నిర్ధేశించిన లక్ష్యంపై ఈ క్షిపణి దాడికి దిగనుందని రష్యా ప్రకటించింది.

English summary
The Russian Defense Ministry has published a video showing the latest test-launch of its new intercontinental ballistic missile (ICBM) at Plesetsk spaceport in the north of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X