వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో దశ ట్రయల్స్ కు రష్యా రెడీ: వచ్చే వారమే 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగం

|
Google Oneindia TeluguNews

రష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించి స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి తీసుకు వస్తామని కూడా ప్రకటించింది . అయితే రష్యా వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాలేదని అలాంటి వ్యాక్సిన్ తో ముప్పు అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రష్యా వ్యాక్సిన్ విషయంలో అనేక అనుమానాలను వ్యక్తం చెయ్యటమే కాకుండా , ఆ వ్యాక్సిన్ సామర్ధ్యంపై విశ్వసనీయత చూపించలేదు . మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితేనే వ్యాక్సిన్ సక్సెస్ అయినట్టు అని చెప్తున్న తరుణంలో రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ కు రంగం సిద్ధం చేస్తుంది రష్యా.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ..45కి పైగా వైద్య కేంద్రాలు , 40,000 మంది

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ..45కి పైగా వైద్య కేంద్రాలు , 40,000 మంది

ఇప్పటికే త్వరిత గతిన మొదటి రెండు ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా , ఇప్పుడు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సర్వ సన్నాహాలు చేస్తుంది. మూడో దశ ట్రయల్స్ లో ఏకంగా 40 వేల మంది వాలంటీర్ లపై ప్రయోగాలు చేయనున్నట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మాస్కోలోని గమలేయ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఈ విషయంపై మాట్లాడుతూ రష్యా చుట్టూ 45 కి పైగా వైద్య కేంద్రాలలో 40,000 మందిపై సామూహిక పరీక్షలు నిర్వహిస్తారని , 40 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్తున్నారు.విదేశీ పరిశోధన సంస్థ పర్యవేక్షిస్తుందని తెలుస్తుంది .

వ్యాక్సిన్ క్లినికల్ డేటా ఈ నెల చివరిలో అకాడెమిక్ జర్నల్‌లో ప్రచురిస్తామన్న రష్యా

వ్యాక్సిన్ క్లినికల్ డేటా ఈ నెల చివరిలో అకాడెమిక్ జర్నల్‌లో ప్రచురిస్తామన్న రష్యా

రష్యన్ వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా అనేక దేశాలు ఇప్పటికీ తమ వ్యతిరేకత తెలియజేస్తున్నాయి అని టీకాకు మద్దతు ఇస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్) అధిపతి కిరిల్ డిమిత్రివ్ మాట్లాడారు .వ్యాక్సిన్ డేటా ఇంకా ఇవ్వలేదని , రెండు దశల ప్రయోగాల వివరాలు వెల్లడించలేదని శాస్త్రవేత్తలు ఆరోపణలు గుప్పిస్తున్న సమయంలో డేటా ఈ నెల చివరిలో అకాడెమిక్ జర్నల్‌లో ప్రచురించబడుతుందని తెలిపారు.రష్యాకు ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మోతాదుల వ్యాక్సిన్ కోసం అభ్యర్థనలు వచ్చాయని పేర్కొన్నారు .

ప్రపంచ ఆరోగ్య సంస్థకు డేటా అందిస్తామన్న రష్యా

ప్రపంచ ఆరోగ్య సంస్థకు డేటా అందిస్తామన్న రష్యా

ఉత్పాదక భాగస్వామ్యం ద్వారా సంవత్సరానికి 500 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కు ఇప్పటివరకు రష్యన్ వ్యాక్సిన్ డేటా ఇవ్వలేదు. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కు కూడా డేటాను అందిస్తున్నామని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్‌తో సహా చివరి దశ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనాలని ఆలోచిస్తున్న పలు దేశాలకు డిమిత్రివ్ చెప్పారు.

Recommended Video

: Fact Check : Did Putin’s Daughter Die After Taking COVID-19 Vaccine?
వచ్చే వారమే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు శ్రీకారం

వచ్చే వారమే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు శ్రీకారం

స్పుత్నిక్ V ఇప్పటికే రష్యా ప్రభుత్వ ఆమోదం పొందిందని పేర్కొన్నారు .వ్లాదిమిర్ పుతిన్ మరియు ఇతర అధికారులు రష్యాకు COVID-19 వ్యాక్సిన్‌కు లైసెన్స్ ఇచ్చిన మొదటి దేశంగా చెప్తున్నారు. మూడో దశ , కీలక దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాకే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తారు . కానీ రష్యా అలా కాకుండా ముందే వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది . ఇప్పుడు రష్యా తరహాలో WHO రికార్డుల ప్రకారం, కనీసం నాలుగు వ్యాక్సిన్ లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం రష్యా కూడా వచ్చే వారమే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభం చేయబోతున్నట్టు ప్రకటించింది.

English summary
Mass testing of Russia's first potential COVID-19 vaccine to get domestic regulatory approval will involve more than 40,000 people and will be overseen by a foreign research body and it starts next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X