వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది...కాక్‌పిట్‌లో ఏం జరిగింది..?

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మోన్టేనీగ్రో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నాటకీయ పరిణామాల మధ్య ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అంతకుముందే కాక్‌పిట్‌లో ఓ ఘటన జరిగింది. ఇంతకీ కాక్ ‌పిట్‌లో ఏం జరిగింది... విమానంను ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 పైలట్‌కు ఏమైంది..?

పైలట్‌కు ఏమైంది..?

రష్యాలో ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం నడుపుతున్న కెప్టెన్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కో పైలట్ విమానంను తన నియంత్రణలోకి తీసుకుని సమాచారంను ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ దృష్టికి తీసుకొచ్చారు. కెప్టెన్ స్పృహ తప్పిపడిపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం చేరవేయగా విమానంను కలుగా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేలా చూశారు. కలుగా విమానాశ్రయం రష్యా రాజధాని మాస్కోకు వాయువ్య దిశలో 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం ప్రధాన పైలట్ నియంత్రణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో విమానం గాల్లో గింగిరాలు తిరిగినట్లు విమానంలోని ప్రయాణికులు చెప్పారు. ఒక్కసారిగా కుదుపులకు లోనైందని తమ ప్రాణాలు ఇక గాల్లో కలిసినట్టే అని తామంతా ఆందోళనపడ్డట్టు తెలిపారు.

గాల్లో కుదుపులకు గురైన విమానం

గాల్లో కుదుపులకు గురైన విమానం

విమానం నడిపే పైలట్ అనారోగ్యంకు గురవడంతో ముందుగా విమానం పూర్తిగా ఒక వైపుకు వాలిపోయిందని ఆ తర్వాత కాస్త రోల్ అయినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఇక కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన పైలట్ ఒక్కసారిగా తమముందు కుప్పకూలిపోయాడని ప్రయాణికులు తెలిపారు. అదే సమయానికి విమానంలో డాక్టరు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా మారిందని వారు గుర్తు చేసుకున్నారు. విమాన సిబ్బందికి కూడా ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.

ల్యాండింగ్‌ కూడా సేఫ్‌గా జరగలేదు

ల్యాండింగ్‌ కూడా సేఫ్‌గా జరగలేదు

ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం నడుపుతున్న పైలట్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక కలుగా ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యాక పైలట్ కోలుకున్నాక తిరిగి తాను విమానం నడిపేందుకు సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే అనారోగ్యానికి గురైన పైలట్ వాష్‌రూంకు వెళ్లే సమయంలో స్పృహ తప్పి పడిపోయినట్లు మరో నివేదిక వెల్లడించింది. కలుగా విమానాశ్రయంలో విమానం అయితే ల్యాండ్ అయ్యిందిగానీ... అది సేఫ్ ల్యాండింగ్ జరగలేదని మరికొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. విమానం ల్యాండ్ అవగానే అస్వస్థతకు గురైన పైలట్ తిరిగి పుంజుకున్నట్లు అధికారులు తెలిపారు. 20 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి విమానం నడుపుతాననే కాన్ఫిడెన్స్‌ను పైలట్ వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

ల్యాండ్ అయ్యేవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి

ల్యాండ్ అయ్యేవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి

ఇక విమానం ల్యాండ్ అయ్యేసరికి అంబులైన్స్ రన్‌వే పక్కన సిద్ధంగా ఉండటంతో పైలట్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అంతకుముందు పైలట్ కుప్పకూలడంతో అతని శరీరం ఒక్కసారిగా నీలం రంగులోకి మారినట్లు ఓ ప్రయాణికుడు వెల్లడించాడు. ఓ యువతి ఆయన దగ్గరకు వెళ్లి ప్రథమ చికిత్స అందించినట్లు చెప్పాడు. పైలట్ స్పృహ కోల్పోవడంతో విమానం కిందకు జారిపోయిందని ఇక విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాకే తాము కలుగా ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గ్రహించినట్లు ప్రయాణికులు తెలిపారు. అప్పటి వరకు ఎక్కడకు వెళుతున్నామో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు.అయితే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రష్యా సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.

English summary
A co-pilot was forced to take over and make a dramatic emergency landing after a plane’s captain suddenly “fainted” while preparing to arrive in Moscow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X