India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్ పై అణుదాడికి పుతిన్ సన్నాహాలు-అమెరికా సీఐఏ హెచ్చరికలు-ఏం జరగబోతోంది ?

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై రెండునెలలు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఎలాంటి ఫలితం తేలలేదు. ఉక్రెయిన్ లో అడుగుపెట్టేముందు బీరాలు పలికిన రష్యా అధినేత పుతిన్.. అక్కడ అడుగుపెట్టాక కానీ వాస్తవ పరిస్దితి అర్ధం కాలేదు. ఉక్రెయిన్ లో రష్యా భారీ ఎత్తున సైనికుల్ని, ఆయుధాల్ని కోల్పోయినా ఇంకా రాజధాని కీవ్ కూడా వారి స్వాధీనం కాలేదు. ఉక్రెయిన్ ప్రతిఘటనలో బిత్తరపోతున్న రష్యా ఏదో ఒక రోజు అణుదాడికి దిగుతుందనే సంకేతాలు వస్తున్నాయి.

ఉక్రెయిన్ లో రష్యాకు దెబ్బలు

ఉక్రెయిన్ లో రష్యాకు దెబ్బలు

ఉక్రెయిన్ లో రష్యా పరిస్దితి నానాటికీ ఇబ్బందికరంగా మారుతోంది. యుద్ధం మొదలుపెట్టి రెండునెలలు కావస్తున్నా ఇంకా పురోగతి లేకపోవడం, ఇంకా ఉక్రెయిన్ లోనే ఉంటే భారీ ఎత్తున సైనికుల్ని, ఆయుధాల్ని కోల్పోయి లొంగిపోవాల్సిన పరిస్ధితులు దాపురించేలా ఉండటం రష్యా అధినేత పుతిన్ ను కలవరపెడుతోంది. ఈ యుద్ధం మొదలుపెట్టాక రష్యాపై ప్రపంచదేశాలు విధించిన ఆంక్షలతో ఇప్పటికే ఆ దేశం కుదేలవుతుండగా.. మరోవైపు యుద్ధం వల్ల రష్యా భారీ ఎత్తున ఆర్ధిక నష్టాల్ని కూడా చవిచూస్తోంది. దీంతో చర్చలకు తెరలేపిన పుతిన్.. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేని పరిస్ధితుల్లో చిక్కుకున్నారు.

పుతిన్ లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

పుతిన్ లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్


ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభించి రెండునెలలు గడుస్తున్నా ఫలితం తేలే అవకాశాలు కనిపించకపోవడంతో ఏదో విధంగా పైచేయి సాధించేందుకు రష్యా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్వదేశంలో మసకబారుతున్న ప్రతిష్టను పునరుద్ధరించుకునేందుకు వీలుగా రష్యా అధినేత పుతిన్ ఉక్రెయిన్ పోరును ముగించేందుకు సిద్దమవుతున్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం మొదలైంది. ఇందుకోసం అణ్వాయుధాల ప్రయోగానికి కూడా సిద్దమవుతున్నట్లు అమెరికా అంచనా వేస్తోంది.

అమెరికా సీఐఏ హెచ్చరికలు

అమెరికా సీఐఏ హెచ్చరికలు

ఉక్రెయిన్‌పై దాడి చేయడంలో రష్యా ఎదురుదెబ్బలతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక లేదా తక్కువ ప్రభావం కలిగిన అణ్వాయుధాన్ని ఉపయోగించేందుకు సిద్ధపడవచ్చని సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ గురువారం చెప్పారు.
పుతిన్, రష్యా నాయకత్వం నిరాశను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికపరంగా వారు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకుని, వ్యూహాత్మక అణ్వాయుధాలు లేదా తక్కువ ప్రభావం కలిగిన అణ్వాయుధాల సంభావ్య రిసార్ట్ ద్వారా ఎదురయ్యే ముప్పును ఎవరూ తేలికగా తీసుకోలేరన్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 24న దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే రష్యా అణు బలగాలను హై అలర్ట్‌లో ఉంచినట్లు క్రెమ్లిన్ తెలిపింది, అయితే మరింత ఆందోళన కలిగించే వాస్తవ పరిస్ధితుల ఆధారంగా బర్న్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

రష్యా అణుదాడి చేస్తే ?

రష్యా అణుదాడి చేస్తే ?

రష్యా పరిమితంగా కానీ, పూర్తిస్దాయిలో కానీ ఉక్రెయిన్ పై అణుదాడి చేయడం ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తే ఆ తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు ఏ విధంగా మారతాయన్న ఆందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే కుప్పలుతెప్పలుగా అణ్వాయుధాలు పోగేసుకున్న రష్యా.. ఇప్పుడు వాటిని ఉక్రెయిన్ పై ప్రయోగిస్తే వాటికి ప్రతిగా నాటోతో పాటు యూరప్ దేశాలు కూడా యుద్ధంలో దిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని ఇన్నాళ్లూ ఆయా దేశాలు మౌనంగా ఉంటున్నాయి. తెరవెనుక మాత్రం ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. కానీ రష్యానే ముందుగా తెగిస్తే మాత్రం ఈ దేశాలు ఎంతవరకూ మౌనంగా ఉంటాయన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

English summary
cia director william burns warns that russian president vladimir putin poses nuclear threat to ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X