• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరికొన్ని గంటల్లో సెకండ్ రౌండ్.. రష్యా ఉక్రెయిన్ చర్చలు.. ఈ సారి ఇక్కడ

|
Google Oneindia TeluguNews

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతుంది.. ఇటు చర్చలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. నిన్న జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. రేపు రెండో రౌండ్ డిస్కషన్ జరగనుంది. ఆరు రోజుల క్రితం ఉన్న ప‌ళంగా ఉక్రెయిన్‌పై దండెత్తి వ‌చ్చిన ర‌ష్యా భీకర దాడుల‌తో తెగ‌బడుతోంది. ఆరు రోజులుగా సాగిస్తున్న యుద్ధాన్ని ర‌ష్యా అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతుంది. ర‌ష్యా దాడుల‌ను తిప్పికొట్టేందుకు త‌న వ‌ద్ద సంప‌త్తితోనే ఉక్రెయిన్ కూడా ఎదురొడ్డి నిలుస్తోంది. చ‌ర్చ‌లు అంటూ ర‌ష్యా ప్ర‌తిపాదించ‌గా..ఉక్రెయిన్ కూడా అందుకు అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే.

సోమ‌వారం రోజున ర‌ష్యా మిత్ర దేశంగా భావిస్తున్న బెలార‌స్‌లో ఇరు దేశాల ప్ర‌తినిధుల మ‌ధ్య తొలి విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగాయి. 3 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డిన నేప‌థ్యంలో ఎలాంటి ఫ‌లితం లేకుండానే చ‌ర్చ‌లు ముగిశాయి. అలా సోమ‌వారం అసంపూర్తిగా ముగిసిన చ‌ర్చ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని ఇరు దేశాలు భావించాయి. ఈ మేర‌కు మ‌రోమారు బెలార‌స్‌లో బుధ‌వారం రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. మ‌రి ఈ చ‌ర్చ‌ల్లో అయినా యుద్ధం ఆగే దిశ‌గా నిర్ణ‌యం వ‌స్తుందా? అన్న అంశ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

second round of talks between Russia and Ukraine is planned for March 2.

ఇటు ఉక్రెయిన్ రష్యా చర్చలు విఫలం అయ్యాయి. దాదాపు 3 గంటలు డిస్కష్ చేసిన కొలిక్కి రాలేదు. యుద్ధంతో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య సోమ‌వారం మధ్యాహ్నం చ‌ర్చ‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బెలార‌స్ వేదిక‌గా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి సాగాయి. డిమాండ్ల‌ను ఇరు దేశాలు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకులేదు. దీంతో ఒక తీర్మానం కూడా జరగకుండానే ముగిశాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత బెలార‌స్‌లో మొద‌లైన చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, ర‌ష్యా నుంచి ఐదుగురు ప్ర‌తినిధుల‌తో కూడిన బృందాలు చ‌ర్చ‌ల‌ు ప్రారంభించాయి.

English summary
second round of talks between Russia and Ukraine is planned for March 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X