India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌లో రష్యా మారణకాండ : మేరియుపోల్‌లో దయనీయమైన‌ పరిస్థితులు .. 1582 పౌరులు మృతి

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌లో మారణకాండ కొనసాగుతోంది. భీకర బాంబుల దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా దాడులతో వేలాది మంది పౌరులు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. . ప్రధాన నగరాల్లో నివాస భవనాలు, ఆస్పత్రులపై కూడా మిస్సైల్స్‌తో విజృంభిస్తోంది. సామాన్య పౌరులను కూడా మాస్కో బలగాలు విడిచిపెట్టడం లేదు. ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి. జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భయంతో లక్షలాది మంది ప్ర‌జ‌లు సరిహద్దు దేశాలకు పారిపోతున్నారు.

  Ukraineలో కనుమరుగవుతున్న నగరాలు, PM Modi అత్యున్నత స్థాయి సమీక్ష!| Oneindia Telugu
   మేరియ‌పోల్‌లో ద‌య‌నీయమైన‌

  మేరియ‌పోల్‌లో ద‌య‌నీయమైన‌

  రష్యా దాడులతో మేరియపోల్‌లో అంత్యం దయనీయ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. మాస్కో దళాల దాడులల్లో వేలాది మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా రోడ్లపై శవాలు పేర్చినట్లు పడి ఉన్నాయి. దీంతో చేసేదేం లేక స్థానిక ప్రభుత్వం.. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తోంది. మేరియపోల్‌లో రష్యా దాడులు మొదలైన ఈ 12 రోజుల్లో 1582 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తెలిపారు. ఈ సామూహిక అంత్యక్రియలకు సంబంధించిన ఓ ఫోటోను దిమిత్రో కుబేలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రష్యా దురాక్రమణలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరాశ్రయులైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

   ర‌ష్యా దాడుల్లో 1582 మంది మృతి

  ర‌ష్యా దాడుల్లో 1582 మంది మృతి

  ఈ భూమి మీద మేరియుపోల్ అత్యంత దారుణమైన మానవతా విపత్తును ఎదుర్కొంటోందని కుబేలా ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను ఎదుర్కోవడం చేతగాక రష్యా నిరాయుధులపై బాంబులు, క్షిపణులు, మిస్సైల్స్‌తో దాడులు చేస్తోందన్నారు. సామాన్య ప్రజానీకానికి అందుతున్న మానవ‌తా సాయాన్ని సైత్యం అడ్డుకుంటూ అత్యంత కూరంగా వ్యవరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ సామూహిక అంత్యక్రియలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయమందిస్తున్నాయి. రష్యా ఘోరాలకు ఆపేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలన్నారు. మాస్కో దాడులను సమర్ధవంతంగా ప్రతిఘటించేందుకు తమకు యుద్ధ విమానాలు అందించాలని కోరారు.

   మిల‌ట‌రీ ట్రైనింగ్ సెంట‌ర్‌పై దాడులు

  మిల‌ట‌రీ ట్రైనింగ్ సెంట‌ర్‌పై దాడులు

  దాడులకు మరింత తీవ్రం చేసిన రష్యా.. పశ్చిమ ఉక్రెయిన్ లోని ల్వీవ్‌కు సమీపంలో ఉన్న మిలటరీ ట్రైనింగ్ సెంటర్‌పై క్షిపణులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో సుమారు 35 మంది చనిపోగా.. మరో 134 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సైనిక శిక్షణా కేంద్రం పోలాండ్ కు సరిహద్దు ప్రాంతంలో ఉంది. మిలటరీ శిక్షణా కేంద్రంపై దష్యా దళాలు 30కి పైగా క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు ల్వీవ్ రీజియన్ గవర్నర్ కోజిట్ స్కీ వెల్లడించారు. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతాంలో ఓ రైలుపై రష్యా సేనలు బాంబు షెల్‌ను ప్రయోగించాయి. ఈ ఘటన బ్రూసెన్ స్టేషన్‌లో సమీపంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో రైలు లోకో పైలట్ అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయడినట్లు అధికారులు వెల్లడించారు.

  English summary
  Massacre in Ukraine, miserable conditions in Mariupol .. 1582 civilians killed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X