వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 మంది మహిళలపై రేప్: 43 ఏళ్ల తర్వాత చిక్కాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

మాస్కో: అత్యంత నీచమైన కార్యాలకు ఒడిగడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఓ నేరస్థుడిని రష్యా పోలీసులు పట్టుకున్నారు. తాను 91 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆ నేరస్థుడు అంగీకరించాడు. అయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అనుమానిస్తున్నారు. అతనికి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మిర్రర్ కథన ప్రకారం - దాదాపు 43 ఏళ్ల క్రితం మొదటి రేప్ చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి పోలీసులు నిందితుడి కోసం వేటాడుతున్నారు. చివరికి ఇప్పుడు చిక్కాడు. అతను నేరాలు చేసిన తీరు తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.

Arrest

నిందితుడి పేరు 'వాల్రీ మెకరెన్‌కోవ్' అతని వయసు 69 ఏళ్లు. తన ప్రతీ పుట్టిన రోజున మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం తన అలవాటుగా మార్చుకున్నాడు. రేప్ చేసిన మహిళలు తన బర్త్‌డే గిఫ్ట్‌లుగా తనకు తాను ప్రకటించుకున్నాడట. ఇప్పటివరకూ 90 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనధికారకంగా 108 మంది మహిళలు భాదితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. రేప్ చేసిన అనంతరం మహిళలకు సంబంధించిన వస్తువులను తన రేప్‌కు గుర్తుగా దాచుకుంటాడని పోలీసులు తెలిపారు. ఎంతోమంది చిన్న బాలికలను కూడా రేప్ చేశాడని, 10 ఏళ్ల వయస్సు గల బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తాను రేప్ చేసే మహిళలు తన కోసమే పుట్టారని బాహాటంగా ప్రకటించాడట. నిందితుడికి ఓ సైకిల్ ఉందని రేప్ చేయాలనుకున్న మహిళలను నల్ల టోపీ పెట్టుకుని సైకిల్‌తో ఫాలో అవుతాడని, రేప్ చేసిన అనంతరం బయపడకుండా కొన్ని వస్తువులను గుర్తులుగా తన వెంట పోలీసులు తెలిపారు.

ఈ కరుడు గట్టిన రేపిస్టు పోలీసులకు అతికష్టం మీద దొరికాడు. నిందితుడిని పట్టుకోవడానికి ముందు 26,000 మంది నేరగాళ్ల వివరాలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత ఓ వ్యక్తి వివరాలు పోలీసుల దగ్గరున్న ఆధారాలకు సరిపోలడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A Russian man has been jailed for 18 years after he confessed to "treating himself to women on his birthday".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X