వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8ఏళ్లకు కోర్టు బయట: ఈ శతాబ్ధపు ఖరీదైన విడాకులు ఖరారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత ఖరీదైన విడాకులు అమలయ్యాయి. విడాకుల కేసు పరిష్కారం కోసం తామిద్దరం ఒక అవగాహనకు వచ్చినట్లు రష్యన్ బిలియనీర్ దిమిత్రీ రిబోలోవ్లెవ్, ఆయన మాజీ భార్య ఎలీనాలు ప్రకటించారు.

చట్టప్రకారం విడాకులు పొందేందుకు కోర్టు చుట్టూ ఎనిమిదేళ్ళ పాటు తిరిగిన ఇద్దరూ చివరకు కోర్టు బయటే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ 5.5 బిలియన్ యూరోలు. ఎలీనాకు 400 కోట్ల స్విస్ ఫ్రాంక్ల (సుమారు రూ. 27.23 వేల కోట్లు)భరణాన్ని ఇవ్వాలని గత ఏడాది మేలో స్విట్జర్లాండ్‌లోని ఒక కోర్టు ఆదేశించింది.

ఇది దిమిత్రీ సంపద విలువలో సగం. అయితే ఈ తీర్పును జెనీవాలోని అపీళ్ల కోర్టు సవరించింది. భార్య ఎలీనాకు 2.9 బిలియన్ యూరోలు చెల్లించి విడిపోయేందుకు దిమిత్రీ సిద్ధమయ్యాడు. కానీ తన అప్పీలుకు కోర్టు అంగీకరించకపోవడంతో ఎనిమిదేళ్ళు సాగి చివరికి కోర్టు బయట సెటిల్ చేసుకున్నారు.

naire Dmitry Rybolovlev's split from his wife is finalised

తన 48 ఏళ్ల మాజీ భార్య ఎలీనా డిమాండ్‌ను అమలు చేసేందుకు అతడి ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రీక్ ద్వీపం, న్యూయార్క్‌లో ఉన్న అతడి ఆస్తులను విక్రయించి మరీ భార్యకు భరణంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం రష్యాకు చెందిన దిమిత్రీ ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలోని 165 మందిలో 14వ స్థానంలో నిలిచారు. సరిగ్గా 30 ఏళ్ల కిందట తన భార్య ఎలీనాను దిమిత్రీ కలిశాడు. అంటే వాళ్లిద్దరూ విద్యార్ధులుగా ఉన్న సమయంలో ఉరెల్ పర్వత ప్రాంతంలో ఆమెను కలుసుకున్నారు.

23ఏళ్ల పాటు సుఖంగా కలిసి జీవించిన ఈ జంట అనేక విషయాల్లో పొరపొచ్చాలు రావడంతో విడిపోయేందుకు మొదటిసారి 2008లో భార్య ఎలీనా కోర్టులో దావా వేసింది. అంతక ముందు దిమిత్రీ 2005లో ఆస్తుల్లో తన వాటాలను ఒక ట్రస్టుకు బదిలీ చేశారు.

మూడేళ్ల తర్వాత భారీ లాభానికి విక్రయించారు. 2005 గణాంకాల ఆధారంగా దిమిత్రీ ఆస్తుల విలువను గణించిందని, 2008 వివరాల ఆధారంగా లెక్కింపు జరగాలంటూ ఎలీనా స్విస్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దిమిత్రి రష్యన్ ఫెర్టిలైజర్ సంస్ధ అయిన జెయింట్ ఉరల్ కలి కి ఛైర్మన్‌గా ఉన్నారు.

గతంలో దిమిత్రీ తన పోటీదారు హత్యకేసులో ఆరోపణలతో 11 నెలలు జైల్లో గడిపారని, అతడితోపాటు ఆమె కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, అతడి జీవితం బెదిరింపులతో గడిచేదని, ఓ బుల్లెట్ ప్రూఫ్ షర్ట్ వేసుకొని ఉండాల్సి వచ్చేదని, అదే భయం తన కుటుంబాన్ని స్విట్లర్లాండ్ తరలించడానికి దారి తీసిందని, తమ విడాకులకు అదే కారణమైందని ఆమె చెప్పారు.

English summary
A Russian oligarch's divorce dubbed the world's most expensive break up has been finalised a year after he was ordered to pay his disgruntled ex-wife a remarkable £2.9bn ($4.5bn). Russian billionaire Dmitry Rybolovlev and his ex-wife Elena yesterday announced they had reached a deal to settle their divorce, following a messy eight-year legal battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X