వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన రష్యా ఫ్లైట్లో 224 మంది: ఎవరూ బతికిలేరు

By Pratap
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టులో ఓ విమానం గల్లంతైంది. ఈ విమానం ఈజిప్టు నుంచి రష్యా వెళ్తోంది. ఇందులో 217 మంది ప్రయాణికులున్నారు. కంట్రోల్ రూంకు విమానం నుంచి సిగ్నల్స్ అందడం లేదు. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే సినాయ్ ప్రాంతంలో ఈ విమానం గల్లంతైంది. గల్లంతైన విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

విమానంలో 200 ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉ్నారు. ఇది రష్యాకు చెందిన పౌర విమానం. ఎర్ర సముద్రంలో గల షర్మ్ ఎల్ - షేక్ రిసార్ట్ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే గల్లంతైంది. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో మొత్తం 224 మంది ఉన్నారు. విమానంలోని వారెవరూ బతికిలేరని అధికారులు చెబుతున్నారు.

Russian civilian plane with 200 passengers goes missing

విమానం కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. రష్యా పౌర విమానం కూలిపోయిందని ఈజిప్టు ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ సినాయ్‌లో అది కూలిపోయిందని చెప్పారు. విమాన ప్రమాదానికి ఉగ్రవాద చర్య కారణం కావచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈజిప్టు సైనిక విమానాలు కూలిన విమానం శకలాలను కనుక్కున్నాయి. పర్వత ప్రాంతాల్లో అది కూలిపోయి కనిపించింది. మృతదేహాలను, గాయపడినవారిని తరలించడానికి 45 అంబులెన్స్‌లను రంగంలోకి దించారు.

టేకాఫ్ అయిన 23 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. విమానంలోని వారంతా చనిపోయి ఉంటారని ఓ అధికారి అన్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 17 మంది పిల్లలు ఉన్నారు.

English summary
A Russian civilian aircraft has reportedly gone missing in Egypt's Sinai region and is feared to have crashed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X