మిలటరీ డ్రిల్‌లో ఘోర ప్రమాదం: మంత్రి దుర్మరణం: ఫొటో జర్నలిస్ట్‌ను కాపాడబోయి..!
మాస్కో: రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ దేశ మంత్రి దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించిన సమయంలో ఆయన మృతి చెందారు. అనుకోకుండా సంభవించిన ఈ ఉదంతంతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మంత్రి దుర్మరణం పాలు కావడం పట్ల రష్యా ప్రజలు షాక్ అయ్యారు. విషాదంలో మునిగిపోయారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

మిలటరీ డ్రిల్ సందర్భంగా..
ఆ మంత్రి పేరు జెవ్గిని జినిచెవ్. రష్యా అత్యవసర సర్వీసుల శాఖ మంత్రి. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. వ్యూహాత్మక మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తోన్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్కిటిక్ జోన్‌లోని నొరిల్స్క్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తోన్న సమయంలో సంభవించిన ప్రమాదంలో జినిచెవ్ మరణించినట్లు అత్యవసర సర్వీసుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

కెమెరామెన్‌ను రక్షించే ప్రయత్నంలో..
ఆర్కిటిక్ జోన్‌లోని నొరిల్స్క్లో మిలటరీ డ్రిల్స్‌ను ఏర్పాటు చేసింది రష్యా అత్యవసర సర్వీసుల మంత్రిత్వ శాఖ. దీనికి ముఖ్య అతిథిగా జినిచెవ్ హాజరయ్యారు. ఆ డ్రిల్స్‌ను కవర్ చేయడానికి పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు హాజరయ్యారు. డ్రిల్స్ కొనసాగుతోన్న సమయంలో ఓ కెమెరామెన్ ప్రమాదావశావత్తూ నీటిలో పడిపోయారు. దీన్ని గమనించిన జినిచెవ్.. ఆ కెమెరామెన్‌ను రక్షించడానికి స్వయంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో మరణించారు. నీటిలోకి దూకిన సమయంలో పొరపాటున అక్కడున్న రాళ్ల మీద పడ్డారు జినిచెవ్.

రష్యన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్
ఫలితంగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతిచెందారు. నీటిలో పడిన ఆ ఫొటోగ్రాఫర్.. రష్యన్ టైమ్స్ ప్రతినిధిగా గుర్తించారు. ఈ విషయాన్ని రష్యన్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ మార్గరీటా సిమోన్యాన్ ధృవీకరించారు. ఆ ఫొటోగ్రాఫర్ నీటిలో పడిన సమయంలో చాలామంది అక్కడే ఉన్నప్పటికీ.. ఆయనను రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదని, దీనితో మంత్రి స్వయంగా పూనుకున్నారని రష్యన్ మీడియా తెలిపింది. ఆ ప్రయత్నంలో మరణించారని పేర్కొంది.

ఉద్రిక్త పరిస్థితులు..
స్ట్రాటజిక్
మిలటరీ
డ్రిల్స్‌ను
కవర్
చేస్తోన్న
సమయంలో
ఆ
ఫొటోగ్రాఫర్
ప్రమాదావశావత్తూ
నీటిలో
పడిపోతుండగా..
ఆయన
చెయ్యిని
పట్టుకుని
మంత్రి
జినిచెవ్
పైకి
లాగే
ప్రయత్నం
చేశారని,
పట్టు
తప్పి
కిందికి
పడిపోయారని
ఆర్బీసీ
న్యూస్
వెబ్సైట్
ఓ
కథనాన్ని
ప్రచురించింది.
జినిచెవ్
ఆకస్మిక
మృతితో
మిలటరీ
డ్రిల్స్‌ను
అర్ధాంతరంగా
రద్దు
చేశారు.
ఆయన
పార్థివ
దేహాన్ని
ఆసుపత్రికి
తరలించారు.
నొరిల్స్క్లో
ఉద్రిక్త
పరిస్థితులు
నెలకొన్నాయి.

పుతిన్ దిగ్భ్రాంతి..
సమాచారం అందుకున్న వెంటనే వేర్వేరు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జినిచెవ్ మృతి పట్ల వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సమాచారం దావానలంలా రష్యా అంతటా వ్యాపించింది. ఆయన స్వస్థలంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ చేస్తోన్నారు. ఓ కెమెరామెన్ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన జినిచెవ్ను హీరోగా అభివర్ణిస్తోన్నారు.

లెనిన్ గ్రాడ్‌లో జననం..
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్.. ఈ ఘటనను అత్యంత విషాదకరమైనదిగా అభివర్ణించారు. జినిచెవ్ ఇక లేరనే విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నానని చెప్పారు. వ్లాదిమిర్ పుతిన్.. ఆయన కుటుంబానికి సంతాప సందేశాన్ని పంపించారని దిమిత్రి చెప్పారు. త్వరలోనే జినిచెవ్ కుటుంబాన్ని కలుసుకుంటారని అన్నారు. 1966లో అప్పటి లెనిన్గ్రాడ్.. ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జినిచెవ్ జన్మించారు. 1987లో రష్యన్ కేజీబీలో చేరారు. 1991లో రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌లో చేరారు. డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అనంతరం 2018లో అత్యవసర సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.