వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాకాశంలో రెండు యుద్ధ విమానాలు ఢీ.. పైలట్ల పరిస్థితి ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో కూడా అధికారులు పసిగట్టలేకున్నారు. తాజాగా రెండు యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే... రష్యాకు చెందిన ఎస్‌యూ-34 యుద్ధ విమానాలు గాల్లో శిక్షణ పొందుతుండగా ఢీకొన్నాయి. ఈ ఘటన జపాన్ సముద్ర తీర ప్రాంతంలో జరిగింది.

రెండు యుద్ధ విమానాలు శిక్షణ పొందుతుండగా ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది విమానంలోనుంచి దూకేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ పైలట్ ఓ చెక్కను పట్టుకుని సముద్రంలో సహాయం కోసం ఎదురు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ వేస్తూ కనిపించడంతో ఆయన్ను కనుగొన్నామని అయితే అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకు వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు వివరించారు.

 Russian fighter jets collide mid-air over Sea of Japan; crews eject

ఇదిలా ఉంటే బయటకు దూకిని మిగతా పైలట్ల పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందన్నారు మిలటరీ అధికారులు .వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక ఢీకొన్న రెండు విమానాలు కూడా ఎక్కడ పడ్డాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వివరించారు. అయితే ఈ ఫైటర్ జెట్లు ఎలాంటి క్షిపణులు మోసుకెళ్లలేదని స్పష్టం చేశారు అధికారులు. ఇవి కేవలం శిక్షణ కోసమే వినియోగించినందున పెను ప్రమాదం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు.

English summary
Two Russian fighter jets have collided in mid-air in the Far East, the Defense Ministry said Friday.The Russian military said in a statement that two Su-34 jets were performing training flights when they came into contact. Both crews ejected from their aircraft, and one pilot has been located on an inflatable raft in the sea as he was flashing the emergency light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X