• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంటల్లో ఆసుపత్రి- డాక్టర్ల సాహసం -ఎవ్వరూ ఊహించని విధంగా ఓపెన్ హార్ట్ సర్జరీని పూర్తిచేశారు

|

భూమిపై కదిలే దేవుళ్లుగా జనం చేత మన్ననలు పొందే డాక్టర్లు.. ఇటీవల మరీ కమర్షియల్ గా తయారై, రోగుల్ని పీడించుకుతింటోన్న ఉదంతాలు చాలానే చూస్తున్నాం. 'ఠాగూర్'సినిమా తరహా ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అయితే, అన్ని సినిమాలు ఒకేలా ఉండవన్నట్లు రోగుల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే డాకర్టు ఇప్పటికీ ఉన్నారని నిరూపించే ఘటన ఒకటి తాజాగా రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చంద్రబాబుకు షాక్: జ్యోతుల, అశోక్ ఫైర్ -పరిషత్ ఎన్నికల బహిష్కరణతో టీడీపీలో ముసలం -నెహ్రూ రాజీనామాచంద్రబాబుకు షాక్: జ్యోతుల, అశోక్ ఫైర్ -పరిషత్ ఎన్నికల బహిష్కరణతో టీడీపీలో ముసలం -నెహ్రూ రాజీనామా

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

రష్యాలోని బ్లాగోవెష్‌చెన్స్క్‌లో గల టిసారిస్ట్-ఎరా ఆసుపత్రిలో.. ఓ రోగికి అత్యంత క్లిష్టమైన ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలో ఆసుపత్రి మంటల్లో చిక్కుకుంది. అయినప్పటికీ వైద్యులు మాత్రం ఏమాత్రం భయపడకుండా, గందరగోళానికి తావివ్వకుండా ఆపరేషన్‌ను పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన తాలూకు ఫొటోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.

విజయవంతంగా ఆపరేషన్..

విజయవంతంగా ఆపరేషన్..

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్‌-హార్ట్‌ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్‌క్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్‌ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికి మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏమాత్రం బెదరకుండా 2 గంటల పాటు సర్జరీని విజయవంతంగా పూర్తిచేసి రోగిని వేరేచోటుకు మార్చారు. ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురైన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా,

పొగ చొరబడకుండా ఫ్యాన్లు పెట్టి..

పొగ చొరబడకుండా ఫ్యాన్లు పెట్టి..

అగ్నిప్రమాదం సమయంలో ఓపెన్‌-హార్ట్‌ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది. ‘‘మంటలు చెలరేగినా.. ఆ రోగిని కాపాడేందుకు మేం చేయగలిగిందంతా చేశాం'' అని వైద్యులు తెలిపారు. ఈ ఆసుపత్రిని 1907లో నిర్మించారు. పైకప్పు చెక్కతో చేసింది కావడంతో నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ తెలిపింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆసుపత్రి నుంచి 128 మందిని ఖాళీ చేయించి సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.

English summary
Russian doctors have stayed behind in a burning, tsarist-era hospital in the country's Far East to complete open-heart surgery after a fire broke out on the roof shortly after the operation began. Doctors continued to conduct the complicated heart by-pass surgery at the Amur State Medical Academy's cardiology centre in Blagoveshchensk despite the fire and the loss of electrical power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X