వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతికి వింత అనుభవం: డేట్ ఖర్చులు చెల్లించాల్సిందే!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఓ లాయర్‌ను ప్రేమించినందుకు గాను ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని క్రాస్ నోయార్క్ప్ ప్రాంతానికి చెందిన నైనా గురోస్కయా అనే యువతి సైబీరియాకు చెందిన ఓ యువ లాయర్‌తో సన్నిహితంగా ఉండేది.

ఈ క్రమంలో వారిద్దరూ కలిసి క్రిమియాకు సమీపంలోని విహారయాత్రకు వెళ్లారు. అయితే ఈ విహారయాత్రలో సైబీరియాకు చెందిన ఆ లాయర్ తనకు ప్రేమను తెలియజేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతికి అతడు ప్రపోజ్ చేయకపోడవంతో ఆమె నిరాశతో ఇంటికి చేరింది.

గత రెండు సంవత్సరాలుగా తన బాయ్ ప్రెండ్‌తో సన్నిహితంగా మెలిగినప్పటికీ, అతడి నుంచి ఎటువంటి లవ్ ప్రపోజల్ రాకపోవడంతో ఆ యువతి అతడిని వదిలేసింది. అంతేకాదు తన ప్రేమ విఫలమైందని బాధలో ఉన్న ఆమెకు గట్టి షాక్ తగిలింది. క్రిమియాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంలో బోకెలకు, రెస్టారెంట్‌లకు చేసిన ఖర్చులకు గాను తనకు సుమారు 45,000 రూబుల్స్ చెల్లించాలని ఆమె బాయ్‌ప్రెండ్ కోర్టు ద్వారా సమన్లు పంపాడు.

Russian man sues ex-girlfriend for expenses incurred on dates

అంతేకాదు వీటికి సంబంధించిన బిల్లులను సైతం కోర్టులో సమర్పించి తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకుంటానని వివరించాడు. కోర్టు సమన్లుతో ఖంగుతిన్న నైనా గురోస్కయా మీడియాతో మాట్లాడుతూ మేమిద్దరం క్రిమియాలోని ఫెడోషియాకు 12 రోజులు విహార యాత్రకు వెళ్లామని పేర్కొంది.

ఇది ఎంతో అందమైన రొమాంటిక్ ట్రిప్‌గా తాను భావించి అతని వద్ద నుంచి లవ్ ప్రపోజల్ వస్తుందని భావించానని, అయితే అలా జరగలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పేరు వెల్లడించిన ఆ లాయర్ ఓ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ గురోస్కయా తానెప్పుడూ గర్ల్ ప్రెండ్‌గా భావించలేదని తేల్చిచెప్పాడు.

అంతేకాదు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం వర్కింగ్ రిలేషన్‌షిప్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెప్పాడు.

English summary
Russian man from Siberia is suing his ex-girlfriend for the 'expenses' she incurred on dates over the course of their two-year relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X